Virupaksha : మీ అంచనాలకు మించి ఉంటుంది.. విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సాయి ధరమ్!
విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ డేట్ కి టైం ఫిక్స్ చేసిన సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej Virupaksha trailer release date announced
Virupaksha : సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) చాలా గ్యాప్ తరువాత ‘విరూపాక్ష’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కథని అందిస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు, టీజర్ అండ్ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఒక కొత్త కథని చూడబోతున్నారు అనే ఫీలింగ్ ని కలగజేశాయి. తాజాగా ప్రేక్షకులను మరింత థ్రిల్ కి గురి చేసేందుకు ట్రైలర్ ని తీసుకు వస్తున్నారు.
Virupaksha: విరూపాక్ష ముగించేశాడు.. కానీ అది మిగిలే ఉంది!
రేపు (ఏప్రిల్ 11) ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఒక ఇంటరెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్ట్ కి సాయి ధరమ్ తేజ్.. ”మీ అంచనాలకు మించి ఉంటుంది. ట్రైలర్ చూసి సర్‌ప్రైజ్ ఫీల్ అవుతారు” అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆడియన్స్ లో ఈ ట్రైలర్ పై మరింత ఆసక్తి పెరిగింది. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 16న ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ఎవరు గెస్ట్ గా రాబోతున్నారా? అని అందరు ఎదురు చూస్తున్నారు.
Sai Dharam Tej : యాక్సిడెంట్ వల్ల నా మాట పడిపోయింది.. నా మీద ట్రోల్స్ చేశారు..
సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సంయుక్త హీరోయిన్ గా (Samyuktha) నటిస్తుండగా సునీల్, రాజీవ్ కనకాల, జాన్సీ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకం పై ఈ చిత్రాన్ని బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 21న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
This will surprise you beyond your imagination#VirupakshaTrailer https://t.co/Q5DcGuH0Gm
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 10, 2023