మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుంది : ఆ నటుడికి సమంత చురకలు

  • Published By: veegamteam ,Published On : March 26, 2019 / 10:47 AM IST
మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుంది : ఆ నటుడికి సమంత చురకలు

Updated On : March 26, 2019 / 10:47 AM IST

స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతారను ఉద్దేశిస్తూ తమిళ సీనియర్ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోలీవుడ్ మొత్తం నయనతారకు మద్దతుగా నిలిచి, రాధారవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కూడా రాధారవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 

ఇప్పుడు స‌మంత కూడా స్పందించారు. ట్విట్ట‌ర్‌లో రాధార‌విని తిట్టిపోశారు. మిస్టర్ రాధారవి కష్టం అనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. మీరు చాలా బాధలో ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుంది. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. న‌య‌న‌తార సూప‌ర్ హిట్ చిత్రానికి టికెట్స్ పంపిస్తాం. పాప్ కార్న్ తింటూ ఎంజాయ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత.

సమంత పోస్ట్ పై నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వివాదంతో రాధారవిని తన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది DMK. అంతేకాదు ఆయనను ఇకపై సినిమాల్లోకి తీసుకోబోమని ఓ నిర్మాణ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.