మోడీ డాడీ.. మే 3 తర్వాత కరోనా స్కైలోకి షిఫ్ట్ అవుతుందా?.. శ్రీ రెడ్డి కాంట్రవర్సియల్ కామెంట్స్
ప్రధాని మోడీ లాక్‌డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..

ప్రధాని మోడీ లాక్‌డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగిసిపోతుంది అని అంతా అనుకుంటుండగా.. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
అయితే మోడీ ప్రకటనపై కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి తన స్టైల్లో స్పందించింది. ‘మే 3 తర్వాత కరోనా వైరస్ ఏమైనా ఆకాశానికి షిఫ్ట్ అవుతుందా?’ అంటూ ప్రశ్నించింది. మీ ఇష్టానికి లాక్‌డౌన్ పొడిగించేస్తే పేదవాళ్ల పరిస్థితి ఏంటి.. వాళ్ల గురించి ఆలోచించండి.
నిత్యావసరాలు కొనుక్కోవడానికి వారికి డబ్బులివ్వండి. మే 3 వరకు అంటున్నారు. ఆ తర్వాత కరోనా ఉన్న వ్యక్తి వేరే వాళ్లకి వైరస్ అంటించడని గ్యారెంటీ ఏంటి.. ఒక్కడి మూలంగా లక్షలాదిమందికి రోగం వస్తే ఏం చేస్తారు?’.. అంటూ శ్రీ ప్రశ్నలు సంధించింది.
Read Also : ప్రగతి ఆంటీ పిచ్చెక్కించిందిగా! స్టెప్స్ చూస్తే సీటీ కొట్టడం పక్కా..