Nandi Awards : నంది అవార్డ్స్ పై బన్నీ వాసు సంచలన కామెంట్స్.. నంది అవార్డ్స్‌ని రెండు ప్రభుత్వాలు!

టాలీవుడ్ లో నంది అవార్డ్స్ విషయం ఎవరొకరు చర్చకు తీసుకు వస్తూనే ఉన్నారు. తాజాగా స్టార్ నిర్మాత బన్నీ వాసు కూడా సంచలన కామెంట్స్ చేశాడు.

Nandi Awards : నంది అవార్డ్స్ పై బన్నీ వాసు సంచలన కామెంట్స్.. నంది అవార్డ్స్‌ని రెండు ప్రభుత్వాలు!

Star Producer Bunny Vasu viral comments on Nandi Awards

Updated On : May 24, 2023 / 8:31 PM IST

Bunny Vasu – Nandi Awards : టాలీవుడ్ లో నంది అవార్డ్స్ రచ్చ రోజురోజుకి ముదురుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఈ అవార్డ్స్ ని సినిమా ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్ ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి నంది అవార్డుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు 2016లో నుంచి ఇవ్వడం ఆపేశాయి. ఇక ఈ పురస్కారం గురించి పలువురు సినీ ప్రముఖులు అనేక సందర్భాల్లో ఏపీ (Andhra Pradesh) మరియు తెలంగాణ (Telangana) ప్రభుత్వాలను అడుగుతూ వస్తున్నారు.

NTR 100 Years : సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్‌ నటుడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

అయితే అటు నుంచి ఎటువంటి రియాక్షన్ కనిపించకపోవడంతో.. ప్రభుత్వాలను విమర్శించేలా పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాతలు సి కళ్యాణ్, అశ్విని దత్త్, జి ఆదిశేషగిరిరావు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ నిర్మాత బన్నీ వాసు కూడా సంచలన కామెంట్స్ చేశాడు.

“ఇటీవల RRR తో మనం ఆస్కార్ అందుకున్నాము. ఆ అవార్డు రావడం ఎంతో గర్వం కారణం. ఆస్కార్ అనేది ఎంతటి గొప్ప పురస్కారమో నంది అవార్డు కూడా అంటే పెద్ద పురస్కారం. అలాంటి అవార్డుని కొన్ని సంవత్సరాలుగా రెండు ప్రభుత్వాలు ఇవ్వడం మానేశాయి. నంది అవార్డు అనేది తెలుగు పరిశ్రమ చేసుకునే పెద్ద పండగ. కాబట్టి దయచేసి సినీ పెద్దలు చొరవ తీసుకోని ప్రభుత్వాలు నంది అవార్డ్స్ ప్రకటించేలా చేయాలనీ కోరుకుంటున్నాను” అంటూ వ్యాఖ్యానించాడు.

Upasana : చిరంజీవి చెప్పారని ఉపాసన ఫోన్ చేశారు.. షాక్ అయ్యానంటున్న పొన్నంబలం!

కాగా ఇటీవల ఈ నంది అవార్డ్స్ గురించి అశ్విని దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. “ప్రస్తుతం నడుస్తున్న సీజన్ వేరు. ఉత్తమ గుండా, రౌడీ కోసం పోటీపడుతున్నారు. ప్రెజెంట్ వాళ్ళకి ఇస్తారు. సినిమాలకు ఇచ్చే అవార్డులు ఇచ్చే రోజులు ఇంకా రెండు మూడేళ్ళలో వస్తుంది” అంటూ వ్యాఖ్యానించిన మాటల పై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.