Super Star Krishna : వెంటిలేటర్‌పై సూపర్‌స్టార్ కృష్ణ ట్రీట్మెంట్..

సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ ఇబ్బంది పడుతుండగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటున్నారు డాక్టర్లు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

Super Star Krishna :  వెంటిలేటర్‌పై సూపర్‌స్టార్ కృష్ణ ట్రీట్మెంట్..

Superstar Krishna treatment on ventilator

Updated On : November 14, 2022 / 1:40 PM IST

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ ఇబ్బంది పడుతుండగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటున్నారు డాక్టర్లు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.

Krishna : స్వల్ప అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ.. నిలకడగా ఆరోగ్యం..

ఉదయం 24 గంటల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించిన అధికారులు. తాజాగా అయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో అయన రాత్రి 2 గంటల సమయంలో హాస్పత్రిలో జాయిన్ అయ్యారు. 20 నిముషాలు పాటు సీపీఆర్ చేసాం. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలి. 48 గంటలు గడిస్తే గాని ఏ విషయం చెప్పలేము అంటున్నారు వైద్యులు.

9 ఏళ్లుగా కృష్ణ ఆ హాస్పిటల్ లో వైద్యం అందుకుంటున్నట్టు, ప్రస్తుతం అయన క్లిష్ట పరిస్థితులను ఎదురుకుంటున్నారని. మా ప్రయత్నం మేము చేస్తున్నం. ఇక్కడ ప్రతి గంటా కీలకమే అని వెల్లడించారు వైద్యులు. దీంతో కృష్ణ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అభిమానులు ఎవరూ ఆసుపత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు.