కొనసాగుతున్న కర్నాటకం : బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

  • Published By: venkaiahnaidu ,Published On : January 18, 2019 / 10:34 AM IST
కొనసాగుతున్న కర్నాటకం : బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

కర్ణాటకలో నెంబర్ గేమ్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటన్ ను ధీటుగా తిప్పికొట్టామని కాంగ్రెస్ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుందో అని కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. శుక్రవారం(జనవరి 18,2019) బెంగళూరులో సీఎల్పీ నేత సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరవకపోవడం కాంగ్రెస్ వర్గాలను కలవరపెడుతోంది.

తప్పనిసరిగా మీటింగ్ కు  హాజరుకావాలని  కాంగ్రెస్ ఆదేశించినప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో ఈ ముగ్గురు బీజేపీలోకి వెళ్లే అవకాశముందన్న వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇటీవల సీఎం కుమారస్వామి చేపట్టిన మంత్రివర్గ విస్తరణ పట్ల అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కాంగ్రెస్ రెబల్  ఎమ్మెల్యేలు  ముంబైలోని ఓ హోటల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా వీరితో హోటల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ సంజయ్ రామచంద్ర పాటిల్ ఈ రోజు ఉదయం ముంబై హోటల్ లో ని ఎమ్యెల్యేలతో సమావేమైనట్లు సమాచారం. కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలుండగా మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది.