Heavy Rain: భారీ వరదలకు ఒక్కరోజే 31 మంది మృతి.. పలువురు గల్లంతు

దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

Heavy Rain: భారీ వరదలకు ఒక్కరోజే 31 మంది మృతి.. పలువురు గల్లంతు

Updated On : August 21, 2022 / 11:49 AM IST

Heavy Rain: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలతోపాటు, కొండ చరియలు విరిగి పడిన ఘటనల్లో శనివారం ఒక్కరోజే మొత్తం 31 మంది మరణించారు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.

Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మునుగోడు సభకు హాజరు.. షెడ్యూల్ ఇదే..

హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి ఈ ఒక్క రాష్ట్రంలోనే 22 మంది మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో పది మంది గాయపడ్డారు. మండి ప్రాంతంలో ఆరుగురు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌లో నలుగురు మరణించారు. మరో పది మంది గల్లంతయ్యారు. ఒడిశాలో 500 గ్రామాల్లోని నాలుగున్నర లక్షల మంది ప్రజలు వరదప్రాంతాల్లో చిక్కుకున్నారు. మహానది పరివాహంలో చిక్కుకున్న 70 మందిని అధికారులు బోట్ల సాయంతో రక్షించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఝార్ఖండ్‌లో వర్షాల ప్రభావానిక అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.

Income tax: నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. 20 వేలు దాటితే నిషేధం

శనివారం ఒక మహిళ మరణించింది. వర్షాల కారణంగా జమ్ము-కాశ్మీర్‌లో ఇటీవల నిలిచిపోయిన వైష్ణోదేవి యాత్ర ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.