ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేసిన ఎంఐఎం చీఫ్ ఒవైసీ

  • Published By: chvmurthy ,Published On : October 19, 2019 / 11:18 AM IST
ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్ చేసిన ఎంఐఎం చీఫ్ ఒవైసీ

Updated On : October 19, 2019 / 11:18 AM IST

మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చేస్తుంటారు.

కొందరు తమ మాటలతో ఆకట్టుకుంటే మరి కొందరు విమర్శలతో ఓటర్లను ఆకట్టుకుంటారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డ్యాన్స్ చేసి ఓటర్లను  ఆకట్టుకున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాద్ లోని పైథాన్ గేట్ ప్రాతంలో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో పాల్గోని ప్రసంగించారు.  ప్రసంగం ముగించి కిందకు దిగి  వస్తూ లౌడ్ స్పీకర్లలో వచ్చే పాటకు స్టెప్పులు వేసి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.  దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.