ప్రఖ్యాత ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేష్ కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2020 / 08:25 PM IST
ప్రఖ్యాత ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేష్  కన్నుమూత

Updated On : September 11, 2020 / 8:52 PM IST

ప్రఖ్యాత ఆర్య సమాజ్ నాయకుడు, సామాజిక కార్యకర్త.. స్వామి అగ్నివేష్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్ (ఐఎల్‌బిఎస్) లో కాలేయ సిరోసిస్ చికిత్స పొందుతున్న అయన పరిస్థితి మంగళవారం రోజున మరింత విషమించడంతో ఆయనను వెంటిలేటర్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ పొందుతూ వున్నా క్రమంలో శుక్రవారం ఉదయానికి అయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఇవాళ సాయంత్రం 6గంటల సమయంలో ఆయనకు గుండెపోటు కూడా వచ్చింది. ఆయనను బ్రతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సాయంత్రం 6:30గంటల సమయంలో స్వామి అగ్నివేష్ తుదిశ్వాస విడిచారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.



స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యాంరావు. ఇతడు 1939, సెప్టెంబరు 21న ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించాడు. తన నాలుగవయేటనే తండ్రి మరణించడంతో తాతగారి స్వగ్రామము చత్తీస్ ఘడ్ వెల్లిపోయారు. కలకత్తాలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదువుకుని అక్కడే అధ్యాపకుడిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు.కొన్నాళ్ళు లెక్చెరర్‌గా కలకత్తాలో పనిచేసారు కొద్దికాలము లాయర్‌గా ప్రాక్టీష్ చేసారు.

ఫిలాసఫీ, న్యాయవాద కోర్సులు చదివినప్పటికీ సామాజిక సమస్యలపై పోరాడేందుకే తన జీవితాన్ని అంకితం చేశారు. హర్యానా రాష్ట్రంలో శాసనసభ్యుడుగా ఎన్నికై విద్యామంత్రిగా సైతం పనిచేసారు.


పర్యావరణ సమస్యలు, బాలల వెట్టిచాకిరిపై పోరాటం, ప్రాంతీయ ఉద్యమాలు తదితర అంశాలపై ఆయన తనదైన శైలిలో ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇటీవల సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నవారికి తన మద్దతు ప్రకటించారు. ఆయన “World council of Arya Samaj” కు అధ్యక్షుడిగా ఉన్నారు.