Assembly polls 2023 : ముగిసిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఛత్తీస్‌గఢ్ లో రెండో విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Chhattisgarh election polling
Assembly polls 2023 : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యప్రదేశ్ పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్ లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఛత్తీస్‌గఢ్ లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయి సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
LIVE NEWS & UPDATES
-
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ పూర్తి.. ఈసారి తగ్గిన ఓటింగ్, ఎంత నమోదైందంటే?
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్‌గఢ్‌లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో 75.63 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 76.88 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే ఈసారి ఇరు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ తగ్గింది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగ్గా.. ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు రెండవ విడతలో భాగంగా 70 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగింది.
-
ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన పోలింగ్
ఛత్తీస్‌గఢ్‌లో రెండో ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.
-
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు ఇవే
మధ్యాహ్నం 3 గంటల వరకు ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఓటింగ్‌లో 55.31%, మధ్యప్రదేశ్‌లో 60.52% ఓటింగ్ నమోదైంది.
-
సీఎం చౌహాన్ సందడి
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రెహ్తీలోని పోలింగ్ బూత్‌ను సందర్శించారు. ఓటింగ్ సరళిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అందరినీ పలకరిస్తూ హుషారుగా కలియతిరిగారు. ఓ చిన్నారితో కేకు కట్ చేయించారు.
#WATCH | Madhya Pradesh CM Shivraj Singh Chouhan visits the polling booth in Rehti pic.twitter.com/1ApgMkeDyv
— ANI (@ANI) November 17, 2023
-
మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ వివరాలు ఇవే
మధ్యాహ్నం 1 గంట వరకు ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ ఓటింగ్‌లో 38.22%, మధ్యప్రదేశ్‌లో 45.40% ఓటింగ్ నమోదైంది. కాగా, మధ్యప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, అంబికాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి టీఎస్ సింగ్ డియో రాజమోహినీ దేవి బాలికల కళాశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#WATCH | Ambikapur: Chhattisgarh Deputy CM and Congress candidate from Ambikapur, TS Singh Deo casts his vote at a polling booth in Rajmohini Devi Girls College. pic.twitter.com/TV2awQRSOS
— ANI (@ANI) November 17, 2023
-
ఓటు వేసిన ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎంపీ సరోజ్ పాండే
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎంపీ సరోజ్ పాండే దుర్గ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#WATCH | Chhattisgarh Assembly Election 2023 | BJP MP Saroj Pandey casts her vote at a polling booth in Durg pic.twitter.com/WbammA02hX
— ANI (@ANI) November 17, 2023
-
ఉదయం 11 గంటల వరకు మధ్యప్రదేశ్ లో 27.62 శాతం పోలింగ్, ఛత్తీస్‌గఢ్ లో 19.65 శాతం పోలింగ్ నమోదు అయింది.
-
మధ్యప్రదేశ్ సీఎం, బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ సెహోర్‌లోని ఒక ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఎన్నికల్లో గెలవాలని ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుద్ని నుండి బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ గా ఉన్నారు.
-
మధ్యప్రదేశ్ పోలింగ్ కేంద్రం వద్ద రాళ్ల దాడి
మధ్యప్రదేశ్ : భింద్‌లోని మెహగావ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మన్హద్ గ్రామంలో పోలింగ్ కేంద్రం బయట రాళ్ల దాడి జరిగింది. బీజేపీ అభ్యర్థి రాకేష్ శుక్లాకు ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
#WATCH | Bhind: Stones were pelted outside the polling station in Manhad village of Mehgaon assembly constituency of Bhind. BJP candidate Rakesh Shukla sustained minor injuries during the incident. Police reached the spot. Further details awaited.#MadhyaPradeshElection2023 pic.twitter.com/qV4hU6oMzN
— ANI (@ANI) November 17, 2023
-
బీజేపీ మద్యం, డబ్బు పంపిణీ : కమల్ నాథ్
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, చింద్వారా అభ్యర్థి కమల్ నాథ్ మాట్లాడుతూ పోలీసులు, డబ్బు, పరిపాలన ద్వారా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. వారికి మిగిలి ఉన్నది ఇంతేనని ఎద్దేవా చేశారు. నిన్న వారు రోజంతా మద్యం, డబ్బు పంపిణీ చేశారని ఆరోపించారు. వీడియోలు తీసి ప్రజలు తనకు పంపారని, ఏమి జరుగుతుందో తనకు వీడియో కాల్‌లో చూపించారని తెలిపారు. మొరెనా ఎస్పీ బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
-
ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు: ఛత్తీస్‌గఢ్ గవర్నర్
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాయ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు వేయడం దేశంలోని ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు అని, పౌరులందరూ తమ హక్కులను వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రం, కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయించుకునే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందని అన్నారు.
#WATCH | Chhattisgarh Elections | Governor Biswabhusan Harichandan cast his vote at a polling booth in Raipur. pic.twitter.com/aPgQNttHMO
— ANI (@ANI) November 17, 2023
-
ఓటు వేసిన కేంద్రమంత్రి
నర్సింగపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తన ఓటు హక్కు వినియోగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలో ఓటు వేయడం పట్ల సంతోషం వెలిబుచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన నర్మద మాత ఆశీస్సులు తమకు ఉంటాయన్నారు.
#WATCH | Madhya Pradesh Elections | Union Minister and BJP candidate from Narsinghpur, Prahlad Singh Patel casts his vote at a polling booth here. pic.twitter.com/CGsGeqjFzm
— ANI (@ANI) November 17, 2023
-
ఉదయం 9 గంటలకు పోలింగ్ వివరాలు
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మధ్యప్రదేశ్‌లో 11.13% ఛత్తీస్‌గఢ్‌లో 5.71% ఓటింగ్ నమోదైంది.
-
కాంగ్రెస్ గెలవదు: సీఎం చౌహాన్
రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. బీజేపీ పట్ల ప్రజలకు ప్రేమ ఉందని, వారి అభ్యున్నతి కోసం తాము పని చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈసారి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలవదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసిందేమీ లేదని సీఎం చౌహాన్ అన్నారు.
-
మధ్యప్రదేశ్ డిమానిలో పోలింగ్ బూత్‌ల వద్ద ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి
మధ్యప్రదేశ్ మోరెనాలోని మిర్ఘన్‌లోని డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లు 147, 148 వద్ద ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో హింసాత్మక సంఘటనలు చోటు చోటు చేసుకున్నాయి. రాళ్లదాడిలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.
-
మధ్యప్రదేశ్ ఇండోర్-1 బీజేపీ అభ్యర్థి కైలాష్ విజయవర్గియా, అతని భార్య ఆశా విజయవర్గీయ ఇండోర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
-
మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి కమల్ నాథ్ చింద్వారాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
-
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ప్రారంభం అయ్యాయి.
-
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
-
మధ్యప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభం అయింది.