Journalist : యువ జర్న‌లిస్ట్ దారుణ హ‌త్య‌

నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అదృశ్యమైన జర్నలిస్టు బుద్ధినాథ్ జా మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసుల గుర్తించారు

Journalist : యువ జర్న‌లిస్ట్ దారుణ హ‌త్య‌

Journalist

Updated On : November 14, 2021 / 10:16 AM IST

Journalist : నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన 22 ఏండ్ల జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అదృశ్యమైన జర్నలిస్టు బుద్ధినాథ్ జా మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసుల గుర్తించారు.. ఘటన వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని మ‌ధుబ‌ని జిల్లా బెనిప‌ట్టీ లోహియా గ్రామానికి చెందిన బుద్ధినాథ్ జా స్థానికంగా ఓ న్యూస్ ఛానల్ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.

చదవండి : Journalist Jailed: కరోనాపై ప్రశ్నించిన మహిళా జర్నలిస్ట్.. ఇప్పుడు చావుబతుకుల మధ్య జైల్లో ఉంది!

దాంతోపాటు ఓ క్లినిక్ కూడా నడుపుతున్నాడు. అతడు స్థానికంగా ఉన్న నకిలీ క్లినిక్‌లపై కథనాలు రాశాడు.. దీంతో కొందరు అతడిని బెదిరించారు.. మరికొందరు డబ్బు ఆశ చూపారు. దేనికి లొంగని బుద్ధినాథ్ జా తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.. నకిలీ క్లినిక్స్ వివరాలను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. అయితే వీటిని గమనించిన క్లినిక్స్ నిర్వాహకులు జాకి ఫోన్ చేసి వెంటనే డిలీట్ చేయాలనీ బెదిరించారు అందుకు జా అంగీకరించలేదు.

మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. బయటకు వెళ్లిన బుద్ధినాథ్ జా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రెండు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బుద్ధినాథ్ జా నడుపుతున్న క్లినిక్ వద్దకు వెళ్లి పోలీసులు పరిశీలించారు.

చదవండి : Journalist: తాలిబాన్లను ప్రశ్నించి, అఫ్ఘాన్ నుంచి పారిపోయిన మహిళా జర్నలిస్ట్

పోలీసులు వెళ్లేసరికి జా ల్యాప్ టాప్ ఓపెన్ చేసే ఉంది.. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి 10 గంటల బుద్ధినాథ్ జా క్లినిక్ వద్దే ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు.. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న అధికారులు విచారణలో వేగం పెంచారు.

చదవండి : Indian Photo Journalist : తాలిబన్ల దాడిలో భారతీయ జర్నలిస్ట్ మృతి

బెటౌన్ జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న ఓ మృతదేహం ఉన్నట్లుగా స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది.. దీంతో ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో… వారు వచ్చి చేతికి ఉన్న రింగ్, మెడ‌లో ఉన్న బంగారు గొలుసు, కాలిపై ఉన్న గాయంతో అత‌ను బుద్ధినాథ్ అని గుర్తించారు. జ‌ర్న‌లిస్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.