పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ.. పత్తా లేని కాంగ్రెస్

  • Published By: veegamteam ,Published On : February 11, 2020 / 06:17 AM IST
పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ.. పత్తా లేని కాంగ్రెస్

Updated On : February 11, 2020 / 6:17 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కేజ్రీవాల్ మూడోసారి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆరు జిల్లాల్లో హవా చూపించింది. మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో అధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకుగానూ ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 57 స్థానాల్లో ఆప్, 13 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఎగ్జిట్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతున్నాయి. 

ఆప్ కు బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. ఈసారి పుంజుకుంది. గతం కంటే ఐదింతలు మెరుగైంది. 27 స్థానాల్లో ఆప్‌, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉంది. 13 స్థానాల్లో ఆప్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. 

మెడల్‌ టౌన్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్‌ మిశ్రా ముందంజలో ఉన్నారు. చాందినీలో ఆప్‌ 9, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ4, ఈస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ 4 , న్యూఢిల్లీలో ఆప్‌ 9, బీజేపీ 1, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 8, బీజేపీ2, వెస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ4, సౌత్‌ ఢిల్లీలో ఆప్‌ 7, బీజేపీ3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.