భార్యతో కలిసి ఓటు వేసిన అమిత్ షా

బీజేపీ చీఫ్ అమిత్ షా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.అహ్మదాబాద్ లోని నరన్ పుర సబ్ జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం అమిత్ షా తన ఓటు వేశారు.అమిత్ షా భార్య సోనాల్ షా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి అమిత్ షా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అహ్మదాబాద్ లో ఉదయం ప్రధాని మోడీ కూడా తన ఓటు వేశారు.రాజ్ కోట్ లో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తన భార్యతో కలిసి వెళ్లి ఓటు వేశారు.
Gujarat: BJP President Amit Shah and his wife Sonal Shah cast their votes at polling booth in Naranpura Sub-Zonal office in Ahmedabad pic.twitter.com/0lNdyv0XDp
— ANI (@ANI) April 23, 2019