బిగ్ బ్రేకింగ్ : భారత్ లో నాలుగో కరోనా మరణం

  • Published By: venkaiahnaidu ,Published On : March 19, 2020 / 11:42 AM IST
బిగ్ బ్రేకింగ్ : భారత్ లో నాలుగో కరోనా మరణం

Updated On : March 19, 2020 / 11:42 AM IST

భారత్ లో నాలుగో కరోనా మరణం నమోదైంది. కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-19,2020)పంజాబ్ లో 70ఏళ్ల వ్యక్తి మరణించాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆయన హొషియార్పూర్ జిల్లాలోని బంగాలోని సివిక్ హాస్పిటల్ లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఆయన ఇటలీ,జర్మనీ లో తిరిగి భారత్ కు వచ్చాడు. దీంతో భారత్ లో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 4కి చేరింది. అయితే పంజాబ్ లో ఇదే తొలి మరణం.

ఇవాళ పంజాబ్ లో మరణించిన వ్యక్తి ఈ నెల ప్రారంభంలో జర్మనీ వయూ ఇటలీ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన బంధువులు,కుటుంబసభ్యులను అధికారులు క్వారంటైన్(నిర్భందం)చేశారు. అంతేకాకుండా మరణించిన వ్యక్తి గ్రామంతో పాటు,ఆ గ్రామానికి 3కిలోమీటర్ల పరిధి ఏరియా వరకు సీల్ వేశారు. బుధవారం నుంచే ఆయన ఇళ్లు సీల్ వేయబడిందని అధికారులు తెలిపారు. ఆయనకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ ను కూడా క్వారంటైన్ చేశారు. 

కరోనా నేపథ్యంలో మార్చి 21నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మొత్తాన్ని బంద్ చేయాలనుకుంటున్నట్లు పంజాబ్ ఇప్పటికే ప్రకటించింది. బస్సులు, ఆటోలు, మినీ వ్యాన్లు మార్చి 20అర్ధరాత్రి నుంచి తిరగడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే ప్రయాణంలో ఉన్నవారు రేపటికల్లా గమ్యస్థానాలకు చేరుకుంటారని ముందస్తుగానే హెచ్చరించినట్లు తెలిపింది. 20మందికి మించి ప్రజలు ఒకేచోట ఉండకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

గతవారంలో మొదటగా కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు, ఆ తర్వాత ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే. మార్చి-17,2020న  కరోనా సోకి ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 64ఏళ్ల వృద్ధుడు కన్నుమూసిన విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది.  అత్యధికంగా చైనాలో కరోనా మరణాలు సంభవించాయి. చైనా తర్వాత స్థానంలో ఇటలీ,ఇరాన్,స్పెయిన్ దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 9వేలు దాటింది. 2లక్షల 20వేలమందికి పైగా కరోనా సోకి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. (కరోనాపై జగన్ యుద్ధం.. ఆంధ్రా షట్ డౌన్!  )

భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 170దాటింది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దాదాపు భారత్ షట్ డౌన్ అయింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించబడ్డాయి. దేశ ప్రజల్లో కరోనా వైరస్ గురించి తీవ్ర భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇవాళ రాత్రి 8గంటలకు జాతినుద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు.