సర్కార్ యాప్ : మొబైల్‌కు కరెంట్ కోతల సమాచారం

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 05:31 AM IST
సర్కార్ యాప్ : మొబైల్‌కు కరెంట్ కోతల సమాచారం

హైదరాబాద్ : మీ విద్యుత్‌ కనెక్షన్‌కు సంబంధించిన సమస్త సమాచారం మీ సెల్‌ఫోన్‌కే వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో  ప్రతి విద్యుత్ కనెక్షన్‌ కస్టమర్ కు  ఫోన్‌ నంబర్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ అన్ని రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఆదేశించింది. మరి మీకరెంటు కనెక్షన్‌ నంబర్‌కు మీ సెల్‌ నంబర్‌ను అనుసంధానం చేశారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే వెంటనే నమోదు చేసుకోండి. 

తెలంగాణ రాష్ట్రంలోని రెండు డిస్కంల పరిధిలో చూడగా  మొత్తం కోటీ 17 లక్షల కనెక్షన్లున్నాయి. వీటిలో కోటి సెల్‌ఫోన్‌ నంబర్లను అనుసంధానం చేశారు. మిగతా 17 లక్షల మంది వినియోగదారుల నంబర్లను సైతం అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి రెండు డిస్కంలు ఆదేశాలిచ్చాయి. దీనికి కష్టమర్ చేయాల్సిందల్లా విద్యుత్‌ సంస్థ వెబ్‌సైట్‌కెళ్లి వారి ఫోన్‌ నంబరును అనుసంధానం చేసుకోవాలి. ఫోన్‌ నంబరు మార్చాలంటే ప్రజెంట్  కరెంటు బిల్లుపై కొత్త ఫోన్‌ నంబరు రాసి ఫొటో తీసి విద్యుత్ సంస్థను ఈమెయిల్‌ పంపించాలి. ఇది హౌస్ లేదా బిజినెస్ పర్పస్ అంటే షాప్స్ లో అద్దెకు ఉండేవారు వారి ఫోన్‌ నంబర్‌నే సబ్‌మీటర్‌కు అనుసంధానం చేయాల్సి వుంటుంది.  ఈ క్రమంలో ఇంటి యజమానుల అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. తమ ఇంట్లో అద్దెకు ఉండేవారు ఎప్పుడు ఖాళీ చేసి వెళతారో తెలియని పక్షంలో వారి నంబర్స్ ను ఎలా అనుసంధానిస్తారని యజమానులు గొడవ వ్యతిరేకను వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సమస్యలతో కొన్ని నంబర్లు అనుసంధానం కావడం లేదని విద్యుత్‌ సిబ్బంది చెబుతున్నారు.

 

యాప్ ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్ 
కష్టమర్స్ కు అందించే ఈ ఫెసిలిటీస్ ను ఆన్‌లైన్‌ ద్వారానే తెలిపేందుకు..వెబ్ సైట్ లోనే కనిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఊర్జ మిత్ర డాట్‌ కామ్‌’ పేరుతో ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. కరెంటు ఉందా? లేదా? లేకపోతే ఎంత టైమ్ కరెంట్ ఉండదు..తిరిగి ఎప్పుడొస్తుందనే వివరాలన్నీ ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోతే వెంటనే ఆ ప్రాంత విద్యుత్‌ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ వస్తుంది.