కమాండర్ ని కాల్చి చంపి..ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 06:31 AM IST
కమాండర్ ని కాల్చి చంపి..ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

Updated On : December 9, 2019 / 6:31 AM IST

సిఎఎఫ్  కానిస్టేబుల్ కమాండర్ ను కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం (డిసెంబర్ 9) ఉదయం 6.30 గంటల సమయంలో రాంచీలో చోటుచేసుకుంది. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల విధులకు వెళ్లిన ఛత్తీస్‌గఢ్‌కు భద్రతా బలగాలకు చెందిన ఓ కానిస్టేబుల్ విక్రమ్‌ రాజ్‌వారే.. కమాండర్‌ రామ్‌ఖురేపై కాల్పులు జరిపాడు. దీంతో కమాండర్‌ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం విక్రమ్‌ కూడా తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కానిస్టేబుల్ కు..కమాండర్ కు మధ్య సెలవుల విషయంలో వివాదం జరిగిందనీ..ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కాల్పులు జరిపాడనీ తరువాత అతను కూడా కాల్చుకున్నాడనీ..దీంతో ఇద్దరూ అక్కడిక్కడే చనిపోయారనీ 12వ బెటాలియన్ కమాండర్ డీఆర్ ఆచాలా తెలిపారు. పైగా కమాండర్ కు మద్యం ఎక్కువగా తాగుతుంటారని కానిస్టేబుల్ విక్రమ్ రాజ్ వారే గతంలో ఓ సారి ఉన్నతాధికారులకు కంప్లైంట్ కూడా చేశారని తెలిపారు. 

విక్రమ్ కాల్చిన కాల్పుల్లో మరో ఇద్దరు కానిస్టేబుల్స కు కూడా గాయాలయ్యాయని తెలిపారు. కాగా..కాల్పుల ఘటన ఛత్తీస్‌గఢ్‌ బలగాల బృందంలోనే చోటు చేసుకుందని జస్‌పురా ఎస్పీ శంకర్‌ భగేల్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2019 ను ఐదు దశల్లో నిర్వహిస్తున్నారు. నవంబర్ 30 న ప్రారంభమై డిసెంబర్ 20 తో ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 23 న జరుగుతుంది.