మోడీగారు స్టయిల్ అదరగొట్టారు..

మోడీ డ్రెస్సింగ్ స్టైలే వేరు. ఇండియన్ పొలిటికల్ ఫ్యాషన్ ఐకాన్ మోడీ సరికొత్త న్యూ లుక్‌ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : December 31, 2018 / 05:30 AM IST
మోడీగారు స్టయిల్ అదరగొట్టారు..

మోడీ డ్రెస్సింగ్ స్టైలే వేరు. ఇండియన్ పొలిటికల్ ఫ్యాషన్ ఐకాన్ మోడీ సరికొత్త న్యూ లుక్‌ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది. తెల్లని గడ్డం, లాంచీ పైజామా, కుర్తా. మోడీ డ్రెస్సింగ్ స్టైలే వేరు. ఇండియన్ పొలిటికల్ ఫ్యాషన్ ఐకాన్ మోడీ సరికొత్త న్యూ లుక్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. సాంప్రదాయ పద్ధతిలో మోడీ పంచకట్టులో మెరిసిపోతున్నారు. పోర్ట్ బ్లెయిర్ వెళ్లిన మోడీ.. ఈ న్యూ లుక్‌ను ఆయనే స్వయంగా తన అధికారిక ఇనస్టోగ్రామ్‌లో పోస్టు చేశారట. అంతేకాదు దీనికో క్యాప్షన్ కూడా పెట్టారండోయ్..‘‘పోర్ట్ బ్లెయిర్‌లో ఈ ఉదయం ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. సూర్యుడు ఉదయించే వేళ.. సాంప్రదాయ దుస్తులు మరింత తేజోవంతంగా వెలిగిపోతున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు నెలకొరిగిన గడ్డపై వారిని గుర్తు చేసుకొనే సమయం ’’ అంటూ పోస్టు పెట్టారు.

మోడీ న్యూ లుక్‌లో.. చేతిలో ఫైళ్లు.. పుస్తకాలు.. పంచకట్టు వేషధారణలో ప్రకృతి అందాలను ఆశ్వాదిస్తూ మోడీ నిలబడిన ఈ ఫొటో అందరిని ఆకట్టుకుంటోంది. ఇనస్టాగ్రామ్‌లో ఈ ఫొటో పోస్టు చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మోడీ న్యూ లుక్‌ను చూసిన నెటిజన్లు అమేజింగ్.. అంటూ కామెంట్లు, కాంప్లీమెంట్లు ఇచ్చేస్తున్నారు.

స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ త్యాగానికి గుర్తుగా ఆయన 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని పోర్ట్ బ్లేయర్‌లో మోడీ 150 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను కూడా మోడీ ప్రారంభించనున్నారు.  

View this post on Instagram

A morning in scenic Port Blair…an early sunrise and traditional attire. Thinking about the brave heroes of our freedom struggle, who gave their lives for our freedom.

A post shared by Narendra Modi (@narendramodi) on Dec 29, 2018 at 7:39pm PST