Rahul Gandhi-Police Video: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులను మీడియా ప్రశ్నించగా ప్రత్యేక సీపీ (ఎల్వో) ఎస్పీ హూడా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీతో మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్ లో పలువురు మహిళలను కలిసి రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారని అన్నారు.

Rahul Gandhi-Police Video: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు

Rahul Gandhi made a reverse attack on BJP's criticism of insulting the country on foreign soil

Updated On : March 19, 2023 / 10:59 AM IST

Rahul Gandhi-Police Video: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అక్కడకు ఎందుకు వచ్చారని పోలీసులను మీడియా ప్రశ్నించగా ప్రత్యేక సీపీ (ఎల్వో) ఎస్పీ హూడా సమాధానం ఇచ్చారు. రాహుల్ గాంధీతో మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జనవరి 30న శ్రీనగర్ లో పలువురు మహిళలను కలిసి రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారని అన్నారు.

తాము అత్యాచారానికి గురయ్యామని తనతో ఆ మహిళలు చెప్పారని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. దీనిపై వివరాలు తీసుకునేందుకు తాము రాహుల్ గాంధీని కలవడానికి వచ్చామని పోలీసులు అన్నారు. రాహుల్ నుంచి వివరాలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితమే రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… “మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయి” అని అన్నారు. దీంతో బాధితుల వివరాలు చెప్పాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు చేరుకోవడంతో వారికి రాహుల్ గాంధీ సమాధానం ఇస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది.

Wipro Layoffs : విప్రోలో మళ్లీ లేఆఫ్.. వంద మందికిపైగా ఉద్యోగులు ఇంటిబాట ..