భారత్ లో కరోనా పంజా, 1071 కేసులు, 29 మరణాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మన దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి పెరిగింది. కరోనాతో 29మంది చనిపోయారు. 942మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 100మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 218కి పెరిగింది. కరోనాతో 8మంది చనిపోయారు. 25మంది కోలుకున్నారు. కేరళలో 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఒకరు చనిపోయారు. గుజరాత్ లో మృతుల సంఖ్య 5కి చేరింది. కర్నాటకలో కరోనా కేసుల సంఖ్య 85కి చేరగా, ముగ్గురు చనిపోయారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్ లో ఇద్దరు మరణించారు. బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లో ఒకరు చొప్పున మరణించారు. తెలంగాణలో 70 కేసులు, ఏపీలో 23కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. కరోనా వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 34వేల మంది మరణించారు. కరోనా కేసుల సంఖ్య 7లక్షల 23వేల 643కి పెరిగింది. ఇప్పటివరకు లక్ష 51వేల 4 మంది కోలుకున్నారు. యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. న్యూయార్క్ లో ఇప్పటివరకు వెయ్యి మంది కరోనాతో చనిపోయారు. మరో 2 వారాల్లో అమెరికాలో కరోనా మరణాల రేటు పెరగనుందని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేసింది.
* ప్రపంచదేశాల్లో రోజురోజుకి విస్తరిస్తున్న వైరస్
* 34వేలకు చేరిన మృతుల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా 7లక్షల 23వేల 643కి చేరిన కరోనా కేసులు
* ఇప్పటివరకు కోలుకున్న 1,51,004 మంది
* యూరప్ దేశాలు, అమెరికాలో పెరుగుతున్న కేసులు
* న్యూయార్క్ లో ఇప్పటివరకు వెయ్యి మంది మఋతి
* మరో 2వారాల్లో అమెరికాలో పెరగనున్న మరణాల రేటు
* స్పెయిన్ లో నిన్న ఒక్క రోజే 838 మంది మృతి
* నిన్న ఇటలీలో 756 మంది, ఫ్రాన్స్ లో 292 మంది మరణం
* నిన్న అమెరికాలో 237 మంది, బ్రిటన్ లో 209 మృతి
* నిన్న ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 17వేల 600 పాజిటివ్ కేసులు నమోదు
* అమెరికాలో లక్షా 41వేల 812కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
* ఇటలీలో లక్షకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య
* చైనాలో 3వేల 300మంది, ఇరాన్ లో 2వేల 640 మంది, ఫ్రాన్స్ లో 2వేల 606 మంది మృతి
* అమెరికాలో 2వేల 475మంది, ఇంగ్లండ్ లో 1,228 మంది మృతి
* అమెరికాలో ఏప్రిల్ 30 వరకు ఆంక్షల పొడిగింపు
* కరోనా వైరస్ ను జూన్ వరకు నిరోధించడం కష్టమే అన్న ట్రంప్
* రానున్న రోజుల్లో అమెరికాలో కరోనా మరణాల సంఖ్య మరింత పెరుగుతుందన్న ట్రంప్
* భారత్ 1,071 కరోనా కేసులు, 29 మరణాలు
* భారత్ లో కరోనా నుంచి కోలుకున్న 99మంది బాధితులు, 942మందికి కొనసాగుతున్న చికిత్స
* తమిళనాడులో కొత్తగా 17 కేసులు నమోదు
* మహారాష్ట్రలో కొత్తగా 12 కేసులు నమోదు, మొత్తం 218 కేసులు, 8 కరోనా మరణాలు
* సాంగ్లీలో ఒకే కుటుంబానికి చెందిన 25మందికి కరోనా
* మధ్యప్రదేశ్ లో తాజాగా 8 కేసులు నమోదు, మొత్తం 47 కరోనా కేసులు
* వెస్ట్ బెంగాల్ లో 2కి చేరిన కరోనా మృతుల సంఖ్య, మొత్తం కేసులు 22
* గుజరాత్ లో 6కి చేరిన కరోనా మరణాలు, కొత్తగా 6 కేసులు, మొత్తం 69 పాజిటివ్ కేసులు
* రాజస్తాన్ 60 కేసులు, పంజాబ్ లో 39 కేసులు
* ఏపీలో 23కి పెరిగిన కరోనా కేసులు, విశాఖలో నమోదైన రెండు పాజిటివ్ కేసులు
* విశాఖలో ఇప్పటివరకు ఆరు కేసులు, యూకే నుంచి వచ్చిన వ్యక్తితో ఇద్దరికి కరోనా వచ్చినట్లు నిర్ధారణ
* విశాఖలో 4 లోకల్ కాంటాక్ట్ కేసులు నమోదు
* ఏపీలో మొత్తం 8కి చేరిన కరోనా కాంటాక్ట్ కేసులు
* తెలంగాణలో 70 కరోనా కేసులు, ఒకరు మృతి