దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రపంచంలో 5వ ప్లేస్‌కి భారత్

  • Published By: vamsi ,Published On : June 7, 2020 / 01:45 AM IST
దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రపంచంలో 5వ ప్లేస్‌కి భారత్

Updated On : June 7, 2020 / 1:45 AM IST

కరోనావైరస్ కేసులు దేశంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రెండున్నర లక్షలకు చేరువగా కరోనా వైరస్ కేసులు చేరుకున్నాయి. మొత్తం 2,41,970 కేసులను నివేదించడం ద్వారా ఆదివారం స్పెయిన్‌ను అధిగమించింది భారతదేశం. దీంతో ప్రపంచంలో కరోనావైరస్ కారణంగా దెబ్బతిన్న 5వ దేశంగా భారత్ రికార్డ్ అయ్యింది.

స్పెయిన్ లో 2,40,978 కేసులుండగా  భారత్ ఆ కేసులను దాటేసింది. ఇదే సమయంలో రికవరీ రేటు 48.27 శాతం నుంచి 48.20 శాతానికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 294 మంది చనిపోగా, మొత్తం మరణాల సంఖ్య 6,642కు చేరింది. కేసుల సంఖ్య విషయంలో శుక్రవారం నాడు ఇటలీని అధిగమించిన భారత్, 24 గంటలు తిరక్కముందే స్పెయిన్ ను దాటేసింది.

ఇండియాలో ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఉన్నాయి. దేశంలో మూడు రాష్ట్రాలు ఇప్పుడు ఐదు అంకెల కేసులను కలిగి ఉన్నాయి. మే 1వ తేదీన ఐదంకెలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర మాత్రమే.