India Corona : ఇండియాలో కరోనా మరణ మృదంగం, మరోసారి 4వేలకు పైగా మరణాలు

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరుసగా మూడోరోజు కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 11వేల 170 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక క్రితం రోజు మరణాలు 4 వేల లోపు నమోదు కాగా.. తాజాగా 4వేల 077 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

India Corona : ఇండియాలో కరోనా మరణ మృదంగం, మరోసారి 4వేలకు పైగా మరణాలు

India Corona

Updated On : May 16, 2021 / 10:15 AM IST

India Corona : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరుసగా మూడోరోజు కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 11వేల 170 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక క్రితం రోజు మరణాలు 4 వేల లోపు నమోదు కాగా.. తాజాగా 4వేల 077 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 2,46,84,077కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 2,70,284గా ఉంది. నమోదవుతున్న కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. నిన్న(మే 15,2021) ఒక్క రోజే 3లక్షల 62వేల 437 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 2,07,95,335కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 36,18,458 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం 18లక్షల 32వేల 950 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 31,48,50,143కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు టీకాలు తీసుకున్న వారి సంఖ్య 18,22,20,164కి చేరింది.