నా కూతురుకి మోడీ కూడా పేరెంటే

నా కూతురుకి మోడీ కూడా పేరెంటే

Updated On : March 19, 2020 / 4:24 AM IST

కరోనా గురించి.. ప్రపంచమంతటికీ గుబులు పుడుతుంటే ప్రతి ఒక్క పౌరునిలో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు  ప్రధాని మోడీ స్వయంగా ట్వీట్లతో సూచనలు చేస్తున్నారు. సమయానికి మనం ఏమైనా చేయగలమని ధైర్యం నింపుతున్నారు. ‘పౌరులకు సహాయం అందించేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. టీం వర్క్‌తోనే ఇలాంటివి చేయగలం. అందరూ కలిసి చేస్తున్న దాంతో పనిని పూర్తి చేస్తామనే అనుకుంటున్నా’ అని మోడీ ట్వీట్ చేశారు. 

అసలు మోడీ ఇలా ట్వీట్ చేయడానికి మరో కారణం.. ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఓ తండ్రి కథనాన్ని ప్రచురించడంపై మోడీ ఇలా స్పందించారు. మహారాష్ట్రలోని ముంబైకు చెందిన సుజయ్ కదం అనే వ్యక్తి కూతురు ఇటలీ నుంచి వచ్చింది. మాస్టర్ డిగ్రీ చదివేందుకు వెళ్లిన యువతి కరోనా కారణంగా కాలేజీలు మూసివేయడంతో ఇంటికి తిరిగొచ్చేసింది. ఫిబ్రవరి 28న అక్కడకు వెళ్లిన కూతురు అంతా బాగానే ఉందని చెప్పింది. 

Also Read | కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్

4నెలలకు సరిపడ రెంటల్ అగ్రిమెంట్ కూడా ఇచ్చేసింది. మార్చి 10న ఫోన్ చేసి.. సూపర్ మార్కెట్లు, కాలేజీలు అన్నీ క్లోజ్ అయిపోయాయి. ప్రతి క్షణం పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇంటికి తిరిగొచ్చేయమని చెప్పాను. ఆ సమయంలో ఇటలీ గవర్నమెంట్.. పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే విమానం ఎక్కేందుకు అనుమతిస్తామని చెప్పింది. దాంతో ఆ యువతికి పర్మిషన్ దొరకలేదు. 

దీంతో ఖదమ్ ఇండియన్ ఎంబస్సీకి మార్చి 12న ఎమర్జెన్సీ మెసేజ్ చేశారు. మార్చి 13న అతనితో మాట్లాడిన ఎంబస్సీ.. 14వ తేదీ నాటికి కూతురిని తీసుకొచ్చి అప్పగించింది. మోడీ ప్రభుత్వం తండ్రిలా బాధ్యత తీసుకుంటుంది. చాలా సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నిందిస్తూ వస్తున్నానని ఈ ఘటనతో అతని మనస్సు పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. మార్చి 15న వచ్చిన తన కూతురికి ఇండో-టిబెటిన్ బోర్డర్ హాస్పిటల్‌లో వైద్య సహాయం అందిస్తున్నారు.