Puri Jagannath : పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట, భారీ సంఖ్యలో భక్తులకు గాయాలు
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

puri jagannath temple
puri jagannath temple : ఎన్నో రహస్యాలకు నెలవు..ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.శుక్రవారం (నవంబర్ 10,2023) జరిగిన ఈ ఘటనలో 10మందికిపైగా భక్తులకు గాయాలయ్యాయి.వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. పూరీ శ్రీమందిర్ లో ‘మంగళ ఆలతి’ ముగింపు సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కార్తీక మాసంలోని శుక్రవారం ఉదయం ఆలయంలో ‘మంగళ ఆలతి’ నిర్వహించగా భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ మంగళ ఆలతి పూర్తి కాగానే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలోకి నెట్టుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 20 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని పూరీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి దేవాలయంలోని శ్రీమందిర్ బయట సతపహచ ముందు బారికేట్లు ఏర్పాటు చేయగా..నాట్యమండపం, జే-బిజయ్ ద్వారా వద్ద ఎలాంటి బారికేడ్లు ఏర్పాటు చేయలేదు. సింహద్వారం దాటి సతపహచ చేరి నాట్యమండంపం దగ్గరకు వచ్చేసరికి భక్తుల రద్దీ బాగా పెరిగిపోయిందని..స్టీల్ బారికేడ్లు, తాళ్లతో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటే భక్తులకు ఎటువైనుంచి ఎటు వెళ్లాలో తెలిసేదని అలా చేయకపోవటంతో ఈ ఘటన జరిగిందని భక్తులు చెబుతున్నారు. కార్తీక మాసంలోని పవిత్ర శుక్రవారం కావడంతో జనులు పెద్దఎత్తున స్వామివారి దర్శనానికి వచ్చారు.