కుక్కను చంపిన డాక్టర్ కు జైలు శిక్ష

  • Published By: veegamteam ,Published On : December 2, 2019 / 06:44 AM IST
కుక్కను చంపిన డాక్టర్ కు జైలు శిక్ష

Updated On : December 2, 2019 / 6:44 AM IST

కుక్కను చంపిన ఓ డాక్టర్ కు కోర్టు 14 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన గజియాబాద్ లో జరిగింది. కాగా..సదరు డాక్టర్ ఓ మహిళకు చెందిన కుక్కను చంపేయటమే కాకుండా ఆమెను కూడా చంపుతానని వార్నంగ్ ఇచ్చాడు. దీంతో ఆమె పోలీస్ కేస్ పెట్టటం అది కోర్టుకు వెళ్లటం..కోర్టు డాక్టర్ కు జైలు శిక్ష విధించేవరకూ వెళ్లింది. 

వివరాల్లోకి వెళితే..ఘజియాబాద్ లోని విజయ్ నగర్ లో డెంటిస్ట్ యామిన్ సిద్ధిఖీ క్లినిక్ నడుపుతున్నాడు. డాక్టర్ ఎదురింట్లో ఉంటున్న ఓ మహిళ పన్ను నొప్పితో బాధపడుతున్న తన కుమార్తెను తీసుకువచ్చింది. నెలల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్నా నొప్పి ఏమాత్రం తగ్గలేదు. పైగా భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. 

దీంతో ఆమె డాక్టర్ దగ్గరకొచ్చి అడగటంతో డాక్టర్ కు ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతటితో ఊరుకోని డాక్టర్ ఓ రోజు చాకు తీసుకుని ఎదురింట్లో ఉంటున్న ఆమె దగ్గరకొచ్చాడు. నానా దుర్భాషలాడుతూ..చాకుతో ఆమెపై దాడికి దిగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె పెంపు కుక్క లడ్డూ అరుస్తూ డాక్టర్ మీదకు వచ్చింది. దీంతో డాక్టర్ కుక్కను పట్టుకుని విసిరికొట్టి..దాని గొంతుపై కాలు వేసి తొక్కాడు. దాన్ని విడిచిపెట్టమని ఆమె వేడుకుంది. కానీ లడ్డూని కాలితో తొక్కి చాకుతో పొడిచి చంపేశాడు. 

తరువాత ఆమెపైకి చాకుతో మీదకొచ్చాడు.అడ్డువచ్చిన ఆమె కుమార్తెపై కూడా దాడికి దిగబోయాడు..అదే సమయంలో వారి ఇంటి ముందు నుంచి కొంతమంది వెళ్తుండగా హెల్ప్ హెల్ప్ అని అరవటంతో వారు రావటంతో డాక్టర్ సిద్ధిఖీ పరారయ్యాడు. 

దీంతో ఆమె డెంటిస్ట్ డాక్టర్ సిద్ధిఖీపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తల్లీ కుమార్తెలపై హత్యాయత్నం కేసు..కుక్కను హత్య చేసినందుకు జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం ప్రకారం  నమోదు చేసుకున్న పోలీసు అధికారి శ్వామ్ వీర్ సింగ్  డాక్టర్ యామిన్ సిద్ధిఖీని అరెస్ట్ చేశారు. అనంతరం కుక్కను పోస్ట్ మార్టానికి పంపించారు. ఈ కేసుపై దర్యాప్తు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆదివారం (డిసెంబర్ 1)న డెటిస్ట్ డాక్టర్ యామిన్ సిద్ధికీ 14 రోజుల జైలు శిక్ష విధించింది.