Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. పలువురు మావోయిస్టులు మృతి?
మావోయిస్టుల క్యాంపుల్లో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనేవున్నాయి.

Chhattisgarh Encounter
Chhattisgarh Encounter : ఛత్తీస్ గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నాగారం, కొత్తపల్లి అడవుల్లో మావోయిస్టులున్నారనే సమాచారంతో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తోంది.
ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులకు గాయాలు అయ్యాయి. మరికొంతమంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసుల అంచనా. మావోయిస్టుల క్యాంపుల్లో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనేవున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.