Telangana Assets : తెలంగాణ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ రిపోర్టు విడుదల.. ఆస్తులు, ఆదాయం, అభివృద్ధి వివరాలు

పదేళ్లలో 137 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.1,37,571 కోట్లు. విద్యుత్ సంస్థల అప్పులు రూ.81వేల కోట్లుగా పేర్కొంది. రాష్ట్రంలో జిల్లాలు 33కు పెంచారు.

Telangana Assets : తెలంగాణ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ రిపోర్టు విడుదల.. ఆస్తులు, ఆదాయం, అభివృద్ధి వివరాలు

Telangana Assets

Updated On : December 20, 2023 / 3:47 PM IST

Telangana Assets Report : తెలంగాణ పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ రిపోర్టు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ డాక్యుమెంటరీ విడుదల చేసింది. పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై రిపోర్టు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం కంటే ముందే బీఆర్ఎస్ డాక్యుమెంట్ విడుదల చేసింది. శాఖల వారీగా ఆస్తులు, అభివృద్ధి, ఆదాయం వివరాలను ప్రకటించింది. పదేళ్లలో 137 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.1,37,571 కోట్లు. విద్యుత్ సంస్థల అప్పులు రూ.81వేల కోట్లుగా పేర్కొంది.

విద్యుత్ సంస్థల అప్పులు 2014లో రూ.22,423 కోట్లు ఉండగా, 2023 నాటికి రూ.81 వేల కోట్లుగా ఉంది. విద్యుత్ సంస్థల ఆస్తులు 2014లో రూ.44,431 కోట్లు ఉండగా, 2023 నాటికి రూ.3,37,571 కోట్లుగా ఉంది. మొత్తం అప్పుల్లో పెరుగుదల రూ.59 వేల కోట్లుగా ఉంది. మొత్తం ఆస్తుల పెరుగుదల రూ.93 వేల కోట్లుగా ఉంది. రాష్ట్రంలో జిల్లాలు 33కు పెంచారు. 30 జిల్లాల్లో రూ.1649.62 కోట్ల వ్యయంతో జిల్లా కలెక్టర్ భవనాలు నిర్మించారు. వీటిలో 25 భవనాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

Gold Price Today : మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

2014 తర్వాత రూ.3.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. 22.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 334 చిన్న పరిశ్రమల పునరుద్ధరణ జరిగింది. 10.400 ఎకరాల్లో అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు అయింది. 10822 కోట్ల రూపాయల ఖర్చుతో 283.71 కోట్ల మొక్కలు నాటారు. దాని ఫలితం విలువ రూ.211 లక్షల కోట్లు.