‘గంగూలీ.. తొలి టీ20ని ఢిల్లీ బయట ఆడించాలి’
ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా నవంబరు 3న బంగ్లాదేశ్-భారత్ ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఇదే సమయంలో అక్కడి గాలిలో కాలుష్య స్థాయి హెచ్చుగా ఉండనుంది.

ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా నవంబరు 3న బంగ్లాదేశ్-భారత్ ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఇదే సమయంలో అక్కడి గాలిలో కాలుష్య స్థాయి హెచ్చుగా ఉండనుంది.
భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ నవంబరు 3న తొలి టీ20 మ్యాచ్ ను ఢిల్లీ వేదికగా ఆడాల్సి ఉంది. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ను ఢిల్లీలో నిర్వహించొద్దంటూ పర్యవరణవేత్తలు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీపావళి ముగిసినప్పటి నుంచి ఢిల్లీలోని గాలి పూర్తిగా పాడైపోయింది. కాలుష్య స్థాయి పెరిగిపోవడంతో శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయని భయపడిపోతున్నారు స్థానికులు.
‘ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా నవంబరు 3న బంగ్లాదేశ్-భారత్ ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఇదే సమయంలో అక్కడి గాలిలో కాలుష్య స్థాయి హెచ్చుగా ఉండనుంది. ఈ కారణంగానే ఢిల్లీకి బయటప్రాంతంలో మ్యాచ్ ను నిర్వహించాలని కోరుతున్నాం. మన క్రికెటర్లు 3 నుంచి 4గంటల వరకూ శారీరకంగా పోరాడాలి. ఈ గాలిలో అంతసేపు ఆడితే వారి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది’ అని గంగూలీకి లేఖ ద్వారా విన్నవించారు.
జ్యోతి పాండే, రవీనా రాజ్ కోహ్లీ పలు స్వచ్ఛంద సంస్థల తరపున పని చేస్తున్నారు. వారితో పాటు మరికొందరు పర్యావరణవేత్తలతో కలిసి గంగూలీకి లేఖ రాశారు. 2017 డిసెంబరులో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ప్లేయర్లు తీవ్ర ఇబ్బందికి గురై మాస్క్ లు ధరించి ఆట ఆడారు. మరి బంగ్లాదేశ్ తో తొలి టీ20కి ఎటువంటి మార్పులు చేస్తారో చూడాలి.