Fire accident in Uttar pradesh: యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఐదుగురి మృతి.. ఏడుగురికి గాయాలు

ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ భవనంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి షార్ట్​ సర్క్యూట్​ కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Fire accident in Uttar pradesh: యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఐదుగురి మృతి.. ఏడుగురికి గాయాలు

Fire accident in uttar pradesh

Updated On : August 26, 2022 / 11:30 AM IST

Fire accident in Uttar pradesh: ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ భవనంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి షార్ట్​ సర్క్యూట్​ కారణమని పోలీసులు భావిస్తున్నారు. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారని అధికారులు చెప్పారు.

దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వివరించారు. మంటలను అదుపులో తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుపుతూనే భవనంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు. భవంనలోని ఏడుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారని, అనంతరం ఆసుపత్రులకు తరలించారని దీంతో వారికి ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. భవనంలో చెలరేగిన మంటల్లో అమరుద్దీన్, సమర్, శామా, నఫియా, ఇబాద్, వ్యక్తి మృతి చెందారని వివరించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో