ఢిల్లీలో కలకలం : రైల్వే స్టేషన్ లో తగలబడిన బోగీ

  • Published By: chvmurthy ,Published On : September 6, 2019 / 09:31 AM IST
ఢిల్లీలో కలకలం : రైల్వే స్టేషన్ లో తగలబడిన బోగీ

Updated On : September 6, 2019 / 9:31 AM IST

ఢిల్లీ : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో శుక్రవారం సెప్టెంబర్6 మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్ ఫాం పై ఆగివున్న ఒక ఎక్స్ ప్రెస్ రైల్లోని పవర్ కార్ లో మంటలు చెల రేగాయి. రైలు 8 వ నెంబరు ప్లాట్ ఫాం పై నిలిపి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది.  పవర్ కార్ లోమంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకోవటంతో ప్రయాణికులు ఆందోళనతో రైలు దిగి పరుగులు తీశారు.

అప్రమత్తమైన  రైల్వే అధికారులు రైల్లో ఉన్నమిగిలిన ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపారు. ప్రయాణికులకు సంబంధించి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరక్కపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  

8 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది.  చండీఘడ్-కొచు వేలి మధ్య  నడిచే ఎక్స్ ప్రెస్ రైల్లో ఈ దుర్ఘటన జరిగింది.