Rafale Deal: రాఫెల్ ఆర్డర్ పూర్తి చేసిన ఫ్రాన్స్, ఒక్కటి మినహా మొత్తం విమానాలు భారత్ కు అప్పగింత
దేశంతో పాటు అంతర్జాతీయంగా రాజకీయ దుమారానికి కారణమై, ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య.. ఫ్రాన్స్-భారత్ మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పంద ప్రాజెక్టును ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేసింది ఫ్రాన్స్

Rafale
Rafale Deal: దేశంతో పాటు అంతర్జాతీయంగా రాజకీయ దుమారానికి కారణమై, ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య.. ఫ్రాన్స్ – భారత్ మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పంద ప్రాజెక్టును ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేసింది ఫ్రాన్స్. రాఫెల్ ఒప్పదం ప్రకారం భారత్ కు అందించాల్సిన 36 రాఫెల్ యుద్ధ విమానాలను చివరి దశలో భాగంగా ఫ్రాన్స్.. భారత్ కు అప్పగించింది. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఒప్పందంలో భాగంగా 36 యుద్ధ విమానాలను భారత్ కు అప్పగించింది ఫ్రాన్స్. అయితే ఒక్క విమానాన్ని మాత్రం భారత అధికారుల సూచన మేరకు..ప్రత్యేకంగా తయారు చేశారు. అన్ని నిర్దిష్ట మెరుగుదలలతో కూడిన చివరి యుద్ధ విమానానికి సంబంధించి అధికారికంగా భారత అధికారులకు అప్పగించినా.. డెలివరీ మాత్రం మార్చి నెలలో ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు అన్ని యుద్ధ విమానాలు భారత్ కు నేరుగా డెలివరీ చేయబడగా.. ఈ చివరి విమానాన్ని మాత్రం ఫ్రాన్సులో భారత అధికారులకు అప్పగించనున్నారు.
Also read: Enforcement Directorate : మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రిని విచారిస్తున్న ఈడి అధికారులు
ఇక రాఫెల్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ మాట్లాడుతూ.. ఫ్రాన్స్ ను భారత్ ఎంత ఉన్నతంగా చూస్తుందని వివరించారు. ఫ్రాన్స్ లోని “ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్”లో జరిగిన “భారతదేశం ఫ్రాన్స్‌ను ఎలా చూస్తుంది” అనే అంశంపై జైశంకర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. గత రెండు దశాబ్దాలలో ప్రపంచ స్థాయిలో భారతదేశం అనేక సంబంధాలలో మార్పు కలిగి ఉందని, అయితే ఫ్రాన్స్‌తో భారతదేశ సంబంధాలు రానున్న తరాలకు వారధిగా ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఫ్రాన్స్‌తో భారత్ సంబంధాలు స్థిరమైన మరియు స్పష్టమైన మార్గంలో ముందుకు సాగుతూనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. “ఇది ఆకస్మిక మార్పులు మరియు ఆశ్చర్యాల నుండి విముక్తి పొందిన సంబంధం, కొన్నిసార్లు మనం ఇతర కోణాలనుంచి చూస్తాము. నిజానికి, ఈ సంబంధాలు నిరంతరం మార్పుకు అనుగుణంగా, దృఢంగా మారుతాయని” ఎస్.జైశంకర్ అన్నారు.
Also read:Russia : యుక్రెయిన్‌పై పంజా విసురుతున్న రష్యా.. ఆర్థిక ఆంక్షలను పట్టించుకోని పుతిన్
అదే సమయంలో ప్రపంచ దేశాలతో ధీటుగా భారత్ ఏ విధంగా ముందుకు పోతుందన్న విషయంపై జైశంకర్ మాట్లాడారు. ఐరోపాలో యుక్రెయిన్ – రష్యా సంక్షోభం సహా ప్రపంచం నేడు అనేక సంక్షోభాల మధ్య ఉందని.. తీవ్ర రాజకీయ, భౌగోళిక-ఆర్థిక మరియు సాంకేతిక మార్పుల నేపథ్యంలో ఈ సంక్షోభాలు ఏర్పడినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయం..ఆయా సంక్షోభాలను తట్టుకునేలా భారత్ శక్తివంతమైందని జైశంకర్ అన్నారు. ఈ పరిణామాలతో అంతర్జాతీయంగా కొత్త సవాళ్లను అధిగమించేందుకు ఇకపై ఎవరిపైనా ఆధారపడకుండా భారత్ విజయం సాదించగలని జైశంకర్ అన్నారు.
France has delivered the entire consignment of 36 #Rafale fighters to India, with the last one being handed over to India in France.
The last fighter with all India’s specific enhancements is expected to be delivered next month. pic.twitter.com/FnQD5WzeTR— Defence Decode® (@DefenceDecode) February 23, 2022
Also read:Russia-Ukraine Crisis: రష్యా సామ్రాజ్యాన్ని పునరుద్దరించే ఆలోచన లేదన్న పుతిన్