టిక్ టాక్ కోసం: బతికున్న కొండచిలువను మంటల్లో..

టిక్ టాక్ కోసం: బతికున్న కొండచిలువను మంటల్లో..

Updated On : October 19, 2019 / 3:08 PM IST

పాము ఎంతటి విష సర్పమైనా కొట్టి చంపేస్తాం. లేదా పాములు పట్టే వాళ్లని పిలిచి తరిమేస్తాం. కానీ, బతికుండగానే కాల్చి చంపడమంటే ఓ పైశాచికత్వమే. ఇటీవల వెర్రిపుంతలు తొక్కుతున్న సోషల్ మీడియా యూజర్లు లైక్‌లు, వ్యూయర్స్ కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడడం లేదు. 

ఇటువంటి ఘటన గుజరాత్ లోని బోదల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో కనిపించిన కొండ చిలువను హింసించారు. బతికుండగానే నిప్పుల్లో పడేసి వీడియోను టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి కొండ చిలువను పట్టుకున్న వ్యక్తుల వివరాలను సేకరించారు. 

‘వన్య ప్రాణుల సంరక్షణ చట్టంలో కొండ చిలువను షెడ్యూల్-1 జంతువుగా గుర్తించారు. హాని కలిగించేవారిపై సెక్షన్ 9 కింద కేసు నమోదు చేస్తాం. నేరం రుజువైతే 3 నుంచి 7సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి’ అని అధికారులు వెల్లడించారు.