ఢిల్లీలో డేంజర్ బెల్స్ : పెరిగిన కాలుష్యం..స్కూళ్లకు సెలవులు

ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తూ..అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రజలను అప్రమత్తంచేసింది. పెరిగిన కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నవంబర్ 5 వరకు సెలవులు ప్రకటించింది.
కాలుష్యంతో..నగరంలో పట్టపగలే ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. నగరవాసులు మాస్కులు లేకుండా బైటకు రాలేని దుస్థితి నెలకొంది. పంజాబ్, హర్యానాల్లో రైతులు పంట వ్యర్థాలు దగ్థం చేయటంతో గ్యాస్ చాంబర్ గా ఢిల్లీ మారిపోయంది. గజియాబాద్, ఫరీదాబాద్, నోయిడాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ క్రమంలో పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ అథారిటీ నవంబర్ 5 వరకు భవన నిర్మాణాల పనులను నిలిపివేయాలని ఆదేశించింది.
కాలుష్యానికి సంబంధించి పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణ అథారిటీ చైర్ పర్శన్ భురే లాల్ ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారు. కాలుష్య నియంత్రణ గురించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చటంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.