దేశంలో కరోనా ఉగ్ర రూపం.. 24 గంటల్లో 86 వేల కేసులు.. 4 మిలియన్ల మార్క్ దాటేసింది

దేశంలో కరోనా మహమ్మారి భయంకరమైన రూపంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనా సంక్రమణ కేసులు భారతదేశంలో వ్యాపించాయి. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 86,432 కేసులు నమోదవగా.. అదే సమయంలో 1,089 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 40 లక్షలు దాటింది.
ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 40 లక్షల 23 వేలకు పెరిగింది. వీరిలో 69,561 మంది మరణించారు. క్రియాశీల కేసుల సంఖ్య 8 లక్షల 46 వేలకు చేరుకోగా.., మొత్తం కరోనా సోకినవారిలో 31 లక్షల 7 వేల మంది కోలుకున్నారు. కోలుకున్నవారి సంఖ్య సంక్రమణ యొక్క చురుకైన కేసుల సంఖ్య కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
ఇప్పటివరకు కరోనా వైరస్ కేసులలో 54% 18ఏళ్ల నుంచి 44 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్నారు. అయితే 51% కరోనా వైరస్ మరణాలు 60 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో సంభవించాయి. 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కోలుకున్న రేటు 77 శాతానికి పైగా ఉంది. మొత్తం ఆరోగ్యకరమైన రోగులలో 30 శాతం మహారాష్ట్ర, తమిళనాడు అనే రెండు రాష్ట్రాలకు చెందినవారు.
క్రియాశీల కేసు రేట్లలో స్థిరమైన క్షీణత నమోదు కావడం ఉపశమనం కలిగించే విషయం. మరణాల రేటు 1.73%కి పడిపోయింది. ఇది కాకుండా, చికిత్స పొందుతున్న క్రియాశీల కేసుల రేటు 21% కి పడిపోయింది. దీనితో, రికవరీ రేటు 77% గా ఉంది.
https://10tv.in/india-coronavirus-cases-and-death-updates-29-august-2020/
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,59,346 పరీక్షలు నిర్వహించగా.. అత్యధికంగా మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 19,218 కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసుల పెరుగుదలలోనూ మహారాష్ట్రదే తొలిస్థానం. ఇక దేశరాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం 2,194 కొత్త కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. గత 69 రోజుల్లో ఇవే అత్యధిక కేసులు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,77,38,491 కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన్లు భారత వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వరుసగా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.