India :దేశంలో దారుణంగా వైద్య,ఆరోగ్య పరిస్థితులపై నివేదిక..1511 మందికి ఒకే ఒక్కడాక్టర్

India Medical Health Sector Conditions 15th Finance Commission Report 1511 People Olny On Doctor
One doctor for 1511 people in India : ఈ కరోనా పరిస్థితుల్లో రోగుల సంఖ్య పెరుగుతోంది గానీ దానికి తగిన వైద్య సిబ్బంది లేరు అనేది చాలా ముఖ్యమైన విషయం. డాక్టర్లు తక్కువ రోగులు ఎక్కువ అయితే ఎలా ఉంటుందో ఈ కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష్యంగా కనిపిస్తున్న విషయం. ఇదే ఏదో మాటవరుసకు అనే మాట ఎంతమాత్రం కాదు. స్వయానా ఆర్థిక సంఘం తాజా నివేదికల్లో వెల్లడైన వాస్తవం. దేశంలో వైద్య ఆరోగ్య రంగ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని 15వ ఆర్థిక సంఘం తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం 1,511 మందికి కేవలం ఒకే ఒక్క డాక్టర్ ఉన్నట్లుగా పేర్కొంది. 100మంది రోగులకు 1.4 పడకలు మాత్రమే ఉన్నాయని ఆర్థిక సంఘం నివేదిక వెల్లడించింది. ఈ లెక్కలు ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాల కంటే చాలా చాలా తక్కువ. భారత్ లోని ఆసుపత్రుల్లో 18,99,228 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయనీ..వీటిలో 60% పైగా ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించినవే కావటం గమనించాల్సిన విషయం. అంటే ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.
నాలో ప్రతి వెయ్యిమందికి 4, శ్రీలంక, బ్రిటన్, అమెరికాల్లో మూడు పడకలు చొప్పున అందుబాటులో ఉన్నాయి. థాయిలాండ్, బ్రెజిల్‌లోనూ రెండుకి మించి లభ్యమవుతున్నాయి. భారత్‌లో బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మణిపుర్, మధ్యప్రదేశ్, అస్సాంలలో పడకల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హరియాణా, తెలంగాణల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువే ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి 1000మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలి. కానీ భారత్‌లో 1,511 మందికి ఒకే డాక్టర్ ఉన్నారని తేలింది. ప్రతి 300 మందికి ఓ నర్స్ అందుబాటులో ఉండాలి. కానీ భారత్ లో 670 మందికి ఒకే నర్సు ఉంది. ఈ క్రమంలో భారత్ లో ప్రజావైద్యంపై కేంద్రం పెట్టే ఖర్చు తగ్గిపోతూ వస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఇక ఎలా ఉంటుందో.