Indian Railways : అపరిశుభ్రమైన టాయిలెట్.. వైజాగ్ ప్రయాణికుడికి రూ. 30వేలు చెల్లించాలి.. భారత రైల్వేకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు

Indian Railways : ప్రయాణంలో అసౌకర్యాన్ని ఎదుర్కొన్న వైజాగ్ ప్రయాణికుడికి రూ. 30వేల పరిహారం ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ భారతీయ రైల్వేని ఆదేశించింది.

Indian Railways : అపరిశుభ్రమైన టాయిలెట్.. వైజాగ్ ప్రయాణికుడికి రూ. 30వేలు చెల్లించాలి.. భారత రైల్వేకు వినియోగదారుల కోర్టు ఆదేశాలు

Indian Railways Order

Updated On : November 1, 2024 / 11:28 PM IST

Indian Railways : తిరుపతి నుంచి వైజాగ్‌లోని దువ్వాడకు ప్రయాణంలో అసౌకర్యాన్ని ఎదుర్కొన్న వైజాగ్ ప్రయాణికుడికి రూ. 30వేల పరిహారం ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కమిషన్ భారతీయ రైల్వేని ఆదేశించింది. కనీస సౌకర్యాలు లేకపోవడంతో శారీరక, మానసిక ఒత్తిడికి గురైన 55 ఏళ్ల వ్యక్తికి న్యాయపరమైన ఖర్చులకు అదనంగా రూ.5వేలు చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే (SCR)ని వినియోగదారుల కోర్టు ఆదేశించింది.

రైలు ప్రయాణంలో ఏం జరిగింది? :
తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తిరుపతి నుంచి దువ్వాడకు వెళ్లేందుకు మూర్తి అనే వైజాగ్ ప్రయాణికుడు తనతో పాటు తన కుటుంబ సభ్యులకు నాలుగు 3ఏసీ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారికి మొదట B-7 కోచ్‌లో బెర్త్‌లు కేటాయించింది. అయినప్పటికీ, నివేదిక ప్రకారం.. ప్రయాణికుల సీటు 3A నుంచి 3Eకి మార్చినట్టు మూర్తికి తర్వాత మెసేజ్ వచ్చింది.

జూన్ 5, 2023న మూర్తి, అతడి కుటుంబం తిరుపతి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కారు. వారి ప్రయాణంలో మరుగుదొడ్డికి వెళ్లేసరికి నీళ్లు లేవు. అదనంగా, కోచ్ ఏసీ సరిగ్గా పని చేయడం లేదు. కోచ్ మొత్తం మురికిగా ఉంది. ఈ సమస్యలపై మూర్తి దువ్వాడలోని సంబంధిత కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఫిర్యాదుపై స్పందించిన భారత రైల్వే :
వైజాగ్ ప్రయాణికుడు తప్పుడు ఆరోపణలు చేసినట్టుగా భారత రైల్వే పేర్కొంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేందుకు ఇలా తప్పుడు ఆరోపణలతో మూర్తి ఫిర్యాదు చేశారని తెలిపింది. రైల్వే అందించిన సేవలను అతని కుటుంబం ఉపయోగించుకుని తమ ప్రయాణాన్ని సురక్షితంగా ముగించారని వాదించినట్టు అవుట్‌లెట్ నివేదించింది.

కమిషన్ ఏం చెప్పిందంటే? :
జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్-I (విశాఖపట్నం) బెంచ్.. భారత రైల్వేకు టిక్కెట్లు సేకరించి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించి ఫంక్షనల్ టాయిలెట్లు, వర్కింగ్ ఏసీ వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొందని నివేదిక తెలిపింది.

సాంకేతిక లోపం, ఎయిర్‌లాక్ కారణంగా టాయిలెట్ నీటి సమస్యను పరిష్కరించేందుకు సిబ్బందిని నియమించినట్టు భారత రైల్వే పేర్కొంది. అయితే, మూర్తి ఫిర్యాదును రైల్వే గుర్తించిందని కమిషన్ పేర్కొంది. కనీస సౌకర్యాలను కూడా పరిశీలించకుండానే రైలు నడుపుతున్నారని వినియోగదారుల కమిషన్ పేర్కొంది.

Read Also : UK Study Scholarships : యూకేలో చదువుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ యూనివర్శిటీలో రూ. 10లక్షల స్కాలర్‌షిప్‌ ఆఫర్!