మీ టూ : నేను లేకుండా కూటమి అసంపూర్ణం

ఎస్పీ-బీఎస్పీ కూటమిలో తన పార్టీని కూడా చేర్చుకోవాలని ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి పీఎస్పీ-ఎల్(ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ-లోహియా) అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కోరారు. పీఎస్పీ-ఎల్ లేకుండా కూటమి అసంపూర్లణంగా ఉంటుందని శివపాల్ అన్నారు. శివపాల్ స్వయానా మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కి బాబాయ్. అఖిలేష్ తో విభేధాల కారణంగా ఆయన ఎస్పీ వదిలి సొంతపార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.
శనివారం చెరో 38 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ఎస్పీ-బీఎస్పీ అధినేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కూటమిలో తన పార్టీని కూడా కలుపుకోవాలని కేవలం సెక్యులర్ ఫ్రంట్ మాత్రమే బీజేపీని ఓడించగలదని శివపాల్ అన్నారు. అయితే బీజేపీ నేతల ఫండింగ్ తోనే శివపాల్ పార్టీని ఏర్పాటు చేశారని, సెక్యులర్ ఓట్లను చీల్చేందుకు ఆయన పార్టీ కుట్రచేస్తోందని, శివపాల్ ని కూటమిలోకి రానివ్వబోమని మాయావతి అన్నారు.
కొన్నిరోజులుగా శివపాల్ తిరిగి తన అన్న ములాయం సింగ్ యాదవ్ తో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఇటీవల శివపాల్ నిర్వహించిన ర్యాలీకి కూడా ములాయం హాజరయ్యారు. శివపాల్ తన పార్టీని ఎస్పీలో కలిపేస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్న సమయంలో అసలు అటువంటిది ఏమీ లేదని, కేవలం ఎన్నికల భాగస్వామ్యానే కోరుకొంటున్నట్లు శివపాల్ తెలిపారు. మతతత్వ బీజేపీని డించడానికి భావసారూప్యత పార్టీలతో కలిసిపనిచేయడానికి తాను సిద్ధమని ఆయన తెలిపారు.