Jharkhand Silkyara Tunnel : తొలి రెండ్రోజులు బతికుంటామా అని భయమేసింది.. ఆ తరువాత ధైర్యం వచ్చింది

సిల్క్యారా టన్నెల్ లో పదిహేడు రోజులు చిక్కుకొని సురక్షితంగా బయటపడిన కార్మికుడు అనిల్ బేడియా మాట్లాడుతూ.. మేము బయటకు వస్తామా? బతికి ఉంటామా అని భయపడినట్లు తెలిపాడు.

Jharkhand Silkyara Tunnel : తొలి రెండ్రోజులు బతికుంటామా అని భయమేసింది.. ఆ తరువాత ధైర్యం వచ్చింది

Anil Bedia

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులు 17రోజులు తరువాత ప్రాణాలతో బయటకు వచ్చిన విషయం విధితమే. సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం రెస్క్యూ బృందాలు వారిని బయటకు తీసుకొచ్చాయి. కార్మికులంతా క్షేమంగా బయటకు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివెరిసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది. అలాగే కార్మికులకు చికిత్సతో పాటు వారంతా తమ ఇళ్లకు చేరేవరకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read : Uttarakhand Silkyara Tunnel : సొరంగాన్ని జయించిన కార్మికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం .. ఒక్కొక్కరికి ఎంతో తెలుసా..?

సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు నీటి పైపుల ద్వారా తమ సమచారాన్ని అధికారులకు తెలిపినట్లుగా పేర్కొన్నారు. సొరంగంలో పడిఉన్న రెండు నీటి పైపుల్లో ఓ ఉత్తరం పెట్టాం. తర్వాత పైపులను బిగించి మోటార్ కు అమర్చి స్టార్ట్ చేశాం.. తద్వారా నీళ్లతో పాటు ఉత్తరం కూడా బయటకు వెళ్లింది.. దాన్ని చూసిన అధికారులు సొరంగం లోపల మేమంతా బతికి ఉన్నట్లు తెలుసుకున్నారని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుడు తెలిపారు. అధికారులు మేము బతికిఉన్న సమచారాన్ని గమనించి మాకు ఆహార పదార్థాలు, ఆక్సిజన్ అందించారు. దీంతో మేము ప్రాణాలతో ఉండగలిగాం అని ఓ కార్మికుడు వివరించారు. ఇలా పలువురు కార్మికులు సొంరంగంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు.

Also Read : DK Shivakumar : హైదరాబాద్‌కు కర్ణాటక డిప్యూటి సీఎం.. గెలిచిన అభ్యర్ధుల బాధ్యత డీకే శివకుమార్‌దే!

ఉత్తరాఖండ్ సొరంగం నుండి సురక్షితంగా బయటపడిన ముగ్గురు కార్మికులు శుక్రవారం తమ గ్రామానికి చేరుకున్నారు. జార్ఖండ్ లోని ఖిరాబెరా గ్రామంకు చెందిన అనిల్ బేడియా, రాజేంద్ర బేడియా, శుక్ర బేడియా శుక్రవారం రాత్రి తమ గ్రామానికి చేరుకున్నారు. వారికి గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. వారి కుటుంబ సభ్యులు వారిని హత్తుకొని సంతోషం వ్యక్తం చేశారు. కార్మికులు ఇంటికి చేరగానే వారి ఇళ్లలో ప్రార్థనలు నిర్వహించారు. అనిల్ బేడియా అనే కార్మికుడు ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. మేము బయటకు వస్తామా? బతికి ఉంటామా అని భయపడినట్లు తెలిపాడు. రెండు రోజులు మేము బయటకు రాగలమా? లేదా అని ఆందోళన చెందామని, ఆ తరువాత మాకు కొంచెం ధైర్యం వచ్చిందన్నారు. పై నుంచి మాకు ఆహారం, ఆక్సిజన్ ఇతర సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో మేము సురక్షితంగా బయటకు వస్తామని భరోసా కలిగిందన్నారు. బయటకు వచ్చిన తరువాత, మేమంతా బాగున్నామని తెలిపారు. గ్రామం మొత్తం మేము సురక్షితంగా బయటకు రావాలని ఎదురుచూసిందని, మా ఇళ్లకు చేరుకున్న తరువాత వారి కళ్లలో ఆనందం కనిపించిందని అన్నారు.