DCCB Recruitment 2021 : గుంటూరు డిసిసిబి బ్యాంకులో ఉద్యోగాల భర్తీ

ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్ లైన్ పరీక్ష మొత్తం 100 మార్కలకు ఉంటుంది.

DCCB Recruitment 2021 : గుంటూరు డిసిసిబి బ్యాంకులో ఉద్యోగాల భర్తీ

Dccb Jobs

Updated On : November 26, 2021 / 1:05 PM IST

DCCB Recruitment 2021 : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ది గుంటూరు డిస్ట్రిక్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ డిసిసిబిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు ;

స్టాఫ్ అసిస్టెంట్లు, క్లర్కు ; ఖాళీలు మొత్తం 61. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లీష్ నాలెడ్జ్ , స్ధానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్లు ; మొత్తం 6ఖాళీలు. దరఖాస్తు చేసుకునే అభ్యర్దులు కనీసం 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్, తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 01.10.21 నాటికి 18 నుండి 30 ఏళ్ల మద్య ఉండాలి.

ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్ లైన్ పరీక్ష మొత్తం 100 మార్కలకు ఉంటుంది. పరీక్ష ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానంలో పరీక్ష ఉండ నుంది. పరీక్షా సమయం 60 నిమిషాలు.

అభ్యర్దులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది 03.12.2021 గా నిర్ణయించారు.