అయోధ్య తీర్పు : యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు

రామజన్మభూమి అయోధ్య కేసు విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుంది. దీంతో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణ నెలకొంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అంతా టెన్షన్..టెన్షన్ గా ఉంది. ఈ క్రమంలో పలు ముందస్తు చర్యలు తీసుకున్న ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. యూపీలో ఈరోజు నుండి (నవంబర్ 9) నుంచి సోమవారం అంటే 11వ తేదీ వరకూ సెలవులు ప్రటించింది.
ఈరోజు ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జమ్మకశ్మీర్ లో అన్ని విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు సెలవులు ప్రకటించారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న ఈ కేసు నేటితో తేలిపోనుంది. దీంతో దేశమంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో దేశంలోని అన్ని దేవాలయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి – బాబ్రీ మసీదు వ్యాజ్యంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30కి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. ఈ క్రమంలో దేశం అంతా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పువైపు దృష్టి సారించింది. తీర్పు అనంతరం ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో అనే ఉత్కంఠ నెలకొంది.