సుశాంత్ ఆత్మహత్యపై ఆ నలుగురిని ఎందుకు ప్రశ్నించలేదు?

  • Published By: vamsi ,Published On : July 19, 2020 / 08:46 AM IST
సుశాంత్ ఆత్మహత్యపై ఆ నలుగురిని ఎందుకు ప్రశ్నించలేదు?

Updated On : July 19, 2020 / 9:27 AM IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. బాలీవుడ్‌లో పనిచేస్తున్న మాఫియా ముఠాను ప్రముఖులు బహిరంగంగా బహిర్గతం చేస్తున్నారు. తొలిసారిగా అలా చేసిన నటి కంగనా రనౌత్ కాగా.. ముంబై పోలీసులు నిష్పాక్షికంగా ఈ విషయంపై దర్యాప్తు చేయట్లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

బాలీవుడ్‌లో సూసైడ్ గ్యాంగ్ తిరుగుతుందని, ఆ ముఠానే సుశాంత్ మరణానికి కారణమని కంగనా ఆరోపించారు. ముంబై పోలీసులు మహేష్ భట్‌ను ప్రశ్నించడానికి ఎందుకు పిలవట్లేదని ఆమె ప్రశ్నించారు. రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మధ్యలో మహేష్ భట్ ప్రమేయం ఏమిటని ప్రశ్నించారు. ఆదిత్య చోప్రాని విచారించాలని ఆమె అన్నారు. కరణ్ జోహార్, రాజీవ్ మసంద్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ వాంగ్మూలాలను పోలీసులు తీసుకోవట్లేదని, ఎందుకంటే వారు శక్తివంతమైన వ్యక్తులు అని అన్నారు.

‘ఆత్మహత్య కాదు.. హత్య’:
ఇది ఆత్మహత్య కాదని, హత్య అని మొదటి రోజు నుండే చెబుతున్నానని కంగనా అన్నారు. తాను ఆత్మహత్య చేసుకోగలిగే పరిస్థితిని సృష్టించడం లేదా వారికి సహాయం చేయడం, సెక్షన్ 57 ప్రకారం, హత్య వంటి పెద్ద నేరం అని ఆమె అన్నారు. భావోద్వేగ సంస్కృతిలో ప్రజలు తమను తాము చంపుకోవాలని భావిస్తారని ఆమె అన్నారు.

సిబిఐ దర్యాప్తు ఉండదా?

మరోవైపు ముంబై పోలీసులు ప్రస్తుతం సుశాంత్ కేసును విచారిస్తున్నారు. కానీ చాలా మంది సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సిబిఐ విచారణ అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. ముంబై పోలీసుల సామర్థ్యంపై నమ్మకం ఉందని దేశ్‌ముఖ్ అన్నారు.