CAA – ‘పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించే వీల్లేదు’

  • Published By: madhu ,Published On : January 19, 2020 / 06:21 AM IST
CAA – ‘పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించే వీల్లేదు’

Updated On : January 19, 2020 / 6:21 AM IST

NRCకి రాష్ట్రాలు సహకరించ లేదని చెబుతుండడంలో అర్థం..కేంద్ర సర్కార్‌కు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు సహకరించరని చెప్పడమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్. CAA రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం..దానిని వ్యతిరేకించడం అసాధ్యమౌతుందని స్పష్టం చేశారు.

 

అలాగే..రాజ్యాంగ ప్రకారం పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రాలు అనుసరించాల్సిందేనని వ్యాఖ్యానించడం విశేషం. సీఏఏ అనేది జాతీయ అంశమని చెప్పిన కపిల్..కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. 

Read More : కేజ్రీ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు..బాంబు పేల్చిన ఆదర్శ్ శాస్త్రి

పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2020, జనవరి 19వ తేదీ కేరళ రాష్ట్రంలోని కొజికోడ్‌లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల క్రమంలో దీనిని చూడరాదన్నారు. CAA అనేది రాజ్యాంగ విరుద్ధమని ఆయన మరో ట్వీట్ చేశారు. దీనిని విరమించుకోవాలంటూ తీర్మానం చేసే రాజ్యాంగపరమైన హక్కు..అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఉంటుందని తెలిపారు.