ప్రత్యేక బస్సుల్లో బెంగళూరుకి మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 10, 2020 / 04:20 PM IST
ప్రత్యేక బస్సుల్లో బెంగళూరుకి మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేలు

Updated On : March 10, 2020 / 4:20 PM IST

మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఎలాంటి అవకాశమివ్వకూడదని భావించిన బీజేపీ..తమ ఎమ్మెల్యేలను బస్సుల్లో వేరే ప్రాంతాలకు తరలిస్తుంది. భోపాల్ లోని పార్టీలో ఆఫీస్ లో ఇవాళ ఎమ్మెల్యేలందరితో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలందరినీ బీజేపీ…ప్రత్యేక బస్సుల్లో వేరే ప్రాంతాలకు తరలిస్తుంది. అయితే తాము ఎక్కడికి వెళుతున్నది తమకి ఇంకా తెలియదని,ఢిల్లీ లేదా బెంగళూరుకి తమ వెళ్లబోతున్నట్లు మాత్రమే తనకు తెలుసునని ఎమ్మెల్యే విజయ్ షా తెలిపారు. బస్సుల్లో ఎక్కిన బీజేపీ ఎమ్మెల్యేలు మంచి ఉషారుతో పాట పాటలు పాడుతూఎంజాయ్ చేశారు.  

మరోవైపు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న గోపాల్ భార్గవ,నరోత్తమ్ మిశ్రాలు ఇవాళ(మార్చి-10,2020) మధ్యాహ్నాం మరికొందరు బీజేపీ నాయకులతో కలిసి భోపాల్ లో అసెంబ్లీ స్సీకర్ నివాసానికి వెళ్లారు. స్పీకర్ ఎన్ పీ ప్రజాపతిని కలిశారు. 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల లేఖలను గోపాల్ భార్గవ స్పీకర్ కు అందజేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ప్రొసీజర్ ప్రకారం తగిన చర్యలు తీసుకోబడతాయని స్పీకర్ ప్రజాపతి మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.