IRCTC Maharajas Express : ఈ రైలు టికెట్టు ధర అక్షరాలా రూ. 19 లక్షలు..!!

IRCTC ద్వారా నిర్వహించబడుతున్న ఈ రైలు టికెట్ ధర రూ.19 లక్షలు.!!

IRCTC Maharajas Express : ఈ రైలు టికెట్టు ధర అక్షరాలా రూ. 19 లక్షలు..!!

IRCTC Maharajas Express

Updated On : December 17, 2022 / 12:22 PM IST

IRCTC Maharajas Express : సాధారణం రైలు ప్రయాణం ఖర్చు తక్కువగాను సౌకర్యవంతంగాను ఉంటుంది బస్సు ప్రయాణంతో పోలిస్తే..కానీ భారత్ లోనే ఓ రైలు ఉందబ్బా..దాంట్లో ప్రయాణించాలంటే విమాన ప్రయాణం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ రైలు టికెట్ ధర అక్షరాలా రూ.19 లక్షలు..!! ఏంటీ ఇది రైలా లేదా విమానమా? విమానంలో కూడా అంత ఉండదే అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మరి ఆ టికెట్ ధర రేంజ్ అలా ఉంది మరి..ఆ రైలే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా నిర్వహించబడుతున్న మహారాజాస్ ఎక్స్‌ప్రెస్..ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది మహారాజాస్ ఎక్స్‌ప్రెస్..దీని టికెట్ ధర రూ.19 లక్షలు కంటే ఎక్కువే..!!

‘మహారాజాస్ ఎక్స్‌ప్రెస్’ వివిధ మార్గాల్లో ప్రయాణీకులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. లగ్జరీ అంటే అలాంటిలాంటి లగ్జరీ కాదు. ఇదో ఓ చిన్న లగ్జరీ విల్లాలాంటిది. పేరుకు తగినట్లే ధర కూడా ఉంది మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించాలంటే ఏకంగా రూ.19లక్షలకు పైనే ఖర్చవుతుంది. మరి అంత ధర ఉందీ అంటే దానికి తగ్గట్లే ఉంటాయి మరి ఫెసిలిటీస్ కూడా.

‘World Oldest Jeans’: 165 ఏళ్లనాటి జీన్స్ ప్యాంట్..! ధర అక్షరాలా Rs.94 లక్షలు..!!

ఈ రైలులో ఒక కోచ్‌ను మొత్తం లగ్జరీ విల్లాలా తీర్చి దిద్దారు. అన్ని ఉన్నాయి దీంట్లో. నిద్రవస్తే పడుకోవటానికి రెండు బెడ్‌రూమ్‌లు, ఓ లివింగ్‌ ఏరియా,ఏ క్లాస్ వాష్‌రూమ్స్ తో పాటు అన్నీ లగ్జీరీగానే ఉంటాయి. టీవీ,డీవీడీ ప్లేయర్,Wi-Fi Internet ఇలా ఒకటేమిటి ఇంట్లో ఏమైతే ఉంటాయో అన్నీ ఈరైలులో ప్రయాణంలో ఆస్వాదించొచ్చు.

ఈ రైలుకు సంబంధించిన వీడియోను కుషాగ్రా అనే నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘భారతీయ రైల్వేలో అత్యంత ఖరీదైన ఈ టికెట్ కోచ్‌ని మీరు ఎప్పుడైనా చూశారా..?’ అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఈ రైలు టికెట్టు ధర రూ. 19 లక్షల పైమాటే. ఈ లగ్జరీ రైలు ప్రయాణం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అన్ని లక్షలే ఉంటే సొంత ఇల్లు కొనుక్కుంటానని ఒకరు..అంత డబ్బే ఉంటే విమానంలోన వెళతానని మరొకరు ఇలా వారి వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరి ఇంకెందుకు లేట్..మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ లగ్జీరీ రైలుపై..

 

View this post on Instagram

 

A post shared by ???????? | Video Creator (@kushagratayal)