మోడీకి ఫేక్ మర్డర్ వార్నింగ్: యువకుడి అరెస్టు

ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం అమెరికా నుంచి భారత్ చేరుకున్న ప్రధాని మోడీ.. చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధానిని మర్డర్ చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారని, రాజీవ్ గాంధీలాగే మోడీని మట్టుబెట్టేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ ఫేక్ వార్నింగ్ ఇచ్చాడు.
సోమవారం ఐఐటీ మద్రాసులో పర్యటించిన మోడీకి ప్రమాదం ఉందని తెలియగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫేక్ వార్నింగ్ అని కొట్టిపారేయకుండా ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ వ్యక్తి చేసిన ఫోన్ ఆధారంగా నెంబరు మీద విచారణ చేపట్టారు. తిరువాన్మియూరుకు చెందిన తిరునావుక్కరసు అనే యువకుడేనని గుర్తించి అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ఆ వ్యక్తి ఉద్యోగం లేకుండా జులాయిగా తిరిగే వ్యక్తిగా గుర్తించారు. తిరునావుక్కరసు అనే పేరుగల వ్యక్తి ఫోన్ చేసి అబద్ధం చెప్పినట్లు తేలింది. ఫలితంగా అతడిని అరెస్టు చేశారు.