Ministry of Cooperation: మోడీ క్యాబినెట్​లో మరో కొత్తశాఖ!

నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మరో కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నారు. సహకార శాఖ పేరుతో ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసి అందుకు ఓ మంత్రిని కూడా నియమించనున్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఈ విషయంపై చర్చలు జరగగా బుధవారం మరింత స్పష్టతవచ్చే అవకాశం ఉంది.

Ministry of Cooperation: మోడీ క్యాబినెట్​లో మరో కొత్తశాఖ!

Ministry Of Cooperation

Updated On : July 7, 2021 / 6:55 AM IST

Ministry of Cooperation: నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మరో కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నారు. సహకార శాఖ పేరుతో ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసి అందుకు ఓ మంత్రిని కూడా నియమించనున్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఈ విషయంపై చర్చలు జరగగా బుధవారం మరింత స్పష్టతవచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గంలో నూతనంగా సహకార శాఖను ఏర్పాటు చేయాలని మోడీ నిర్ణయించగా.. త్వరలోనే ఇది ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

సహకారంతోనే సమృద్ధి అనే విజన్​ను అమలు చేసేందుకు ఈ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు తెలపగా.. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఈ శాఖ లక్ష్యమని తెలిపాయి. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను ఈ మంత్రిత్వ శాఖ రూపొందిస్తుందని చెప్పారు. సహకార ఆధారిత ఆర్థిక అభివృద్ధి విధానం సరిగ్గా సరిపోతుంది. సహకార సంస్థల సులభతర వాణిజ్యం కోసం ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది.

కేంద్ర ఆలోచనలోని ఈ కొత్త సహకార శాఖకు బుధవారం కొత్త మంత్రిని నియమించే అవకాశం ఉండగా.. ప్రజా ఉద్యమం క్షేత్రస్థాయికి చేరుకునేందుకు నూతన మంత్రిత్వ శాఖ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా పనిచేసే వ్యక్తులు ఉన్న ఈ దేశానికి, బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధిని సాకారం చేసేందుకు ఈ శాఖ పాటుపడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సమాజ ఆధారిత అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుందని.. కొత్త మంత్రిత్వ శాఖ ఆ దిశగా ముందడుగు అని సంబంధిత వర్గాలు తెలిపాయి.