రష్యాకు మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : September 2, 2019 / 03:08 PM IST
రష్యాకు మోడీ

Updated On : September 2, 2019 / 3:08 PM IST

భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం(సెప్టెంబర్-3,2019)రష్యా వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌,నరేంద్ర మోడీ చర్చించనున్నారు. కాగా పుతిన్ తో మోడీ సమావేశం అవుతుండటం ఇది మూడోసారి.

ఈ ఏడాది కిర్గిస్తాన్ లో జరిగిన షాంగై కోఆపరేషన్ సమ్మిట్ సందర్భంగా ఓసారి, జపాన్ లోని ఒసాకాలో జరిగిన G20మీటింగ్ సందర్భంగా మరోసారి మోడీ,పుతిన్ లు కలుసుకున్నారు. ఇప్పుడు మరోసారి మోడీ,పుతిన్ లు కలుసుకోనున్నారు. మోడీ, పుతిన్‌తో భేటీ సందర్భంగా..రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సహకారం, ఇంధనం మరియు కనెక్టివిటీ కారిడార్లపై రెండు దేశాలు రెండు డజన్ల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

తన రష్యా పర్యటన సందర్భంగా సెప్టెంబర్ 4నుంచి 6వరకు వ్లాదివోత్సక్ లో జరిగే  5వతూర్పు దేశాల ఆర్థిక సదస్సు(EEF)లో ప్రత్యేక అతిధిగా మోడీ పాల్గొంటారు. వివిధ దేశాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ప్రధాని షింజో అబే, మలేషియా ప్రధాన మంత్రి మహతీర్ మొహమాద్, మంగోలియన్ అధ్యక్షుడు ఖల్త్మాగిన్ బతుల్గా కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో చైనా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, సింగపూర్, ఇండోనేషియాతో సహా అనేక ఇతర దేశాల నుండి మంత్రివర్గాల భాగస్వామ్యం కనిపించనుంది.