Lok Sabha Elections 2024: అందివచ్చిన పార్టీలను కూటమిలో చేర్చుకుంటున్న బీజేపీ.. అందుకేనా?

జేపీకి సొంతంగా దక్షిణాదిలో బలం లేకపోతే.. కాంగ్రెస్‌ ఉత్తరాదిలో ఒంటరిగా నెగ్గుకురాలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు..

Lok Sabha Elections 2024: అందివచ్చిన పార్టీలను కూటమిలో చేర్చుకుంటున్న బీజేపీ.. అందుకేనా?

Lok Sabha Election 2024

కూటములు ఏవైనా.. పార్టీలు ఎన్నయినా.. అన్నింటి అంతిమ లక్ష్యం ఒక్కటే. అది అధికారం. ఎలాగైనా పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకొని.. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే పరామావధి. దేశంలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు… సొంతంగా ఎంత బలం ఉన్నా కూటమి రాజకీయాలపైనే దృష్టి పెట్టాయి.

కారణాలేవైనా.. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటకు వెళ్లిపోతుంటే… ఆ అవకాశాన్ని చేజిక్కించుకుటోంది బీజేపీ. అందివచ్చిన పార్టీలను కూటమిలో చేర్చుకుంటున్న కమలదళం… మరోసారి అధికారం చేపట్టే దిశగా వ్యూహాలు రచిస్తోంది.

దేశంలో బలమైన పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌.. అధికారం చేజిక్కించుకోవడం కోసం కలిసి వచ్చే పార్టీలను కలుపుకొనిపోయే పనిలో పడ్డాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీతో పోల్చితే.. సగం కూడా ఓట్ల శాతం దక్కించుకోలేదు హస్తం పార్టీ. ఇక సీట్ల విషయంలో అయితే.. బీజేపీకి కనుచూపు మేరలో కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో కొత్త పార్టీలను కలుపుకొని.. యూపీఏ కాస్తా.. ఇండియా కూటమిగా మారిపోయింది.

కాంగ్రెస్‌కు దూరం చేసే వ్యూహం
ఇక కేంద్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీకి.. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా ఉన్నప్పటికీ.. కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా ప్రాంతీయ పార్టీలను తమకు చేరువ చేసుకోవడంతోపాటు.. వాటిని కాంగ్రెస్‌కు దూరం చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసిన బీజేపీ.. మిత్రపక్షాలతో కలిసి 332 సీట్లు సాధించింది. అదే కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ మాత్రం కేవలం 91 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో బీజేపీ మరింత బలపడుతూ వచ్చినా.. అడపాదడపా కాంగ్రెస్‌ కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. దక్షిణాదిలో బీజేపీ చేతిలో ఉన్న ఒకే ఒక రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపొందడం బీజేపీకి పెద్ద షాకే ఇచ్చిందని చెప్పొచ్చు.ఈ క్రమంలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా.. మిగతా మూడు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీయే విజయం సాధించింది.

ఒంటరిగా నెగ్గుకురాలేని పరిస్థితి
అయితే.. బీజేపీకి సొంతంగా దక్షిణాదిలో బలం లేకపోతే.. కాంగ్రెస్‌ ఉత్తరాదిలో ఒంటరిగా నెగ్గుకురాలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలు కూటమి బలోపేతంపై దృష్టి సారించాయి. అంతేకాదు.. కూటముల్లో పోటాపోటీగా పార్టీలను చేర్చుకొని బల ప్రదర్శనలు సైతం చేశాయి.

అనుకున్న దానికంటే ఎక్కువగానే పార్టీలను చేర్చుకున్నా.. సీట్ల కేటాయింపు అనే అసలైన సమస్య మొదలైంది. ఇప్పటికే అధికారంలో ఉండటం, దానికితోడు చాలా రాష్ట్రాల్లో బలంగా ఉండటం వల్ల బీజేపీకి సీట్ల కేటాయింపు వల్ల పెద్ద ఇబ్బందులు లేకపోయినా.. కాంగ్రెస్‌కు మాత్రం ఇదో తలకు మించిన భారంలా మారింది.

ఈ క్రమంలోనే ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పార్టీ బయటకు రావడం ప్రారంభమైంది. మరోవైపు కొన్ని పార్టీలు సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించేశాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ.. ఇండియా అలయెన్స్‌ నుంచి బయటకు వచ్చిన పార్టీలను తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాన్ని ప్రారంభించింది.

వాళ్ల చెంపలు పగలకొట్టండి.. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు