బీజేపీలో ఎవ్వరికీ ఆ అర్హత లేదన్న కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : February 6, 2020 / 07:05 PM IST
బీజేపీలో ఎవ్వరికీ ఆ అర్హత లేదన్న కేజ్రీవాల్

Updated On : February 6, 2020 / 7:05 PM IST

ఢిల్లీలో మైక్ లు మూగబోయాయి. శనివారం(ఫిబ్రవరి-8,2019)నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రధాన పార్టీలుగా ఆమ్ ఆద్మీ,బీజేపీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మరోసారి మరోసారి నిలబెట్టుకోవాలని  ఆమ్ ఆద్మీ పార్టీ,ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ,గత వైభవాన్ని మళ్లీ కొనసాగించాలని కాంగ్రెస్ లు ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో వ్యూహాలు రచించారు. ఇక మిగిలింది ప్రజలు ఓట్లు వేయడమే,

అయితే గురువారం కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీలో సీఎం అయ్యే అర్హత ఎవ్వరికీ లేదని ఢిల్లీ సీఎం అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నారు. ఒకవేళ వాళ్లు ఏ సంబిత్ పాత్రానో,అనురాగ్ ఠాకూర్ నో సీఎంని చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలింగ్ కు ముందైనా సీఎం అభ్యర్థిని బీజేపీ ప్రకటించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓట్లు చీల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని,ఎవరు గెలుస్తారో 11న తేలుతుందన్నారు.

జనవరి 15నుంచి బీజేపీ షాహీన్ బాగ్ గురించే మాట్లాడుతోందని,ఇతర విషయాలను పక్కకు పెట్టిందన్నారు. అనధికార కాలనీల క్రమబద్దీకరణ వల్ల 40లక్షల మంది ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారని,గత నాలుగు నెలల్లో రిజస్టర్ చేయించింది కేవలం 20మందికేనని,ఈ లెక్కన 40లక్షల మందికి రిజిస్టర్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఉచిత పథకాలను కొనసాగిస్తామని, వాయు కాలుష్యం తగ్గించడం.స్వచ్ఛ ఢిల్లీ,రోడ్ల ఆధునికీకరణ,24/7నీటి సదుపాయం కల్పించడం తమ ముందున్న లక్ష్యాలని కేజ్రీవాల్ చెప్పారు. మంచి రోడ్లు,ఉన్నతమైన వైద్య సదుపాయాలు,మంచి విద్య,24గంటల విద్యుత్ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆప్ కు ఓటు బ్యాంకేనని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రజలకు మేలు చేసే మంచి పథకాలను తాము అమలుచేస్తున్నామని,మళ్లీ అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.