ఆర్మీ చీఫ్ కి రాజకీయాలు ఎందుకు : అసదుద్దీన్ ఒవైసీ సీరియస్

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పొలిటికల్ లీడర్‌గా మారాలనుకుంటున్నారా..ఇదే ఆరోపణ ఇప్పుడు విపక్షాలు చేస్తున్నాయ్..పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 02:22 AM IST
ఆర్మీ చీఫ్ కి రాజకీయాలు ఎందుకు : అసదుద్దీన్ ఒవైసీ సీరియస్

Updated On : December 27, 2019 / 2:22 AM IST

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పొలిటికల్ లీడర్‌గా మారాలనుకుంటున్నారా..ఇదే ఆరోపణ ఇప్పుడు విపక్షాలు చేస్తున్నాయ్..పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పొలిటికల్ లీడర్‌గా మారాలనుకుంటున్నారా..ఇదే ఆరోపణ ఇప్పుడు విపక్షాలు చేస్తున్నాయ్..పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనలపై ఆయన చేసిన కామెంట్లే ఇందుకే కారణమంటున్నాయ్.. దీంతో బిపిన్ రావత్‌కి బిజెపి మద్దతుగా నిలిస్తే..కాంగ్రెస్, ఎంఐఎం మాత్రం మాటల దాడికి దిగాయ్..ఇంతకీ బిపిన్ రావత్ ఏమన్నారు

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సరైన లీడర్‌షిప్ ఎలా ఉండాలో చెబుతూ చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయ్. సిక్స్ సిగ్మా హెల్త్‌ కేర్ లీడర్‌షిప్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న బిపిన్ రావత్ లీడర్‌ అంటే అందరినీ సరైన దిశలో నడిపించేవారని..తప్పుడు దిశలో నడిపించేవారు కాదన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల దగ్గర విద్యార్ధులు చేస్తోన్న ఆందోళనలు గమనిస్తూనే ఉన్నామని..విధ్వంసం, హింసకు పాల్పడుతున్న ఈ ఆందోళనని నడిపించడం లీడర్‌షిప్ కాదంటూ కామెంట్ చేశారాయన.

బిపిన్ రావత్ వ్యాఖ్యలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఆందోళన చేసే హక్కు ఉఁటుందన్నారు. ఆర్మీ చీఫ్‌గా ఉండి ఇలా మాట్లాడకూడదని, రావత్ వైఖరి ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు ఉందంటూ ఆరోపించారు.

మరోవైపు కేంద్రహోంమంత్రి అమిత్‌షా కూడా కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు. ఢిల్లీలో ప్రశాంతతని కాంగ్రెస్, ఆ పార్టీ ఆధ్వర్యంలోని తుక్డే గ్యాంగ్‌లే చెల్లా చెదురు చేస్తున్నాయంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ వాసులే వారికి బుద్ది చెప్తారన్నారు.

ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యలని కాంగ్రెస్ కూడా సీరియస్‌గా తీసుకుంది. రావత్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారని, ఇలా అయితే ఆయన ఏదో ఒక రోజు సైనికచర్యకి కూడా పాల్పడతారంటూ కాంగ్రెస్ నేత బ్రిజేష్ కలప్పా ట్వీట్ చేశారు. ఐతే కేంద్రమంత్రి రాందాస్ అథవాలే మాత్రం ఓ పౌరుడిగా తన అభిప్రాయం చెప్పే హక్కు రావత్‌కి ఉందంటూ ఆయనకి మద్దతుగా నిలిచారు. డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్న బిపిన్ రావత్ మొదటి సిడిఎస్‌ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఆయన కామెంట్లకి రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది.