సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు : రాహుల్ స్పందన

  • Published By: madhu ,Published On : October 4, 2019 / 02:51 PM IST
సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు : రాహుల్ స్పందన

Updated On : October 4, 2019 / 2:51 PM IST

దేశద్రోహం చట్టం కింద వివధ రంగాలకు చెందిన ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశాన్ని ఒక వ్యక్తి పాలించాలని..ఒకే సిద్ధాంతాన్ని అమలు చేయాలని వారు భావిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, నిజానికి ప్రపంచ వ్యాప్తంగా తెలుసన్నారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం వాయనాడ్ కు వచ్చారు రాహుల్. అక్కడ రాత్రి వేళ ట్రాఫిక్ బ్యాన్ విధించడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. వీరిని రాహుల్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…

విరుద్ధంగా గళమెత్తుతున్న వారిపై దాడులు జరుగుతున్నాయని, ప్రధానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతొక్కరిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టి వేధిస్తున్నారంటూ రాహుల్ ఆరోపించారు. మోడీకి వ్యతిరేకంగా ఏదైనా చెప్పినా..వారెవరైనా జైలులో పడేస్తారని, దేశం ఒక వైపు పయనిస్తోందన్నారు. 

Read More : మోడీకి బహిరంగ లేఖ : సెలబ్రెటీలపై దేశద్రోహం కేసు నమోదు
మూకదాడులపై ఆందోళన చేస్తూ..ప్రముఖ చరిత్రాకారుడు రామచంద్ర గుహ, దర్శకుడు మణిరత్నం, అపర్ణసేన్ తో సహా వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రముఖులు గతంలో ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఈ కేసు నమోదైంది. దేశం, ప్రధాని ప్రతిష్టతను ప్రముఖులు దెబ్బ తీశారని ఆరోపిస్తూ..దాఖలైన పిటిషన్ పై బీహార్ కోర్టు విచారణ జరిపింది. కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ఆధారంగా అక్టోబర్ 03వ తేదీ గురువారం కేసు నమోదు చేశారు.